Chef Saru

సేమియా పాయసం (Semiya Payasam / Vermicelli Kheer Recipe)

5/5 - (1 vote)

You Can Change Language:

You Can Change Language:

See this post in

Semiya Payasam / Vermicelli Kheer Recipe:

శ్రావణ మాసం రానే వచ్చింది. మరి ఈ శ్రావణ మాసం లో తెలుగింటి ఆడపడుచుల హడవిడి అంతా ఇంత కాదు అందరూ ఈ మాసం లో చేసుకునే వ్రతం సౌభాగ్యాన్నిచ్చే వరలక్ష్మి వ్రతం, ఎంత చిన్నగా చేసుకున్న అమ్మవారికి కనీసం ఒక మూడు పదార్థాలన్న నివేదన చేస్తారు.

అన్నీ వ్రతాలేమో కానీ వరలక్ష్మి వ్రతానికి మాత్రం ప్రసాదాలే ముఖ్యం. అలాంటి ప్రసాదాల్లో ఒకటే సెమియా పాయసం( Classic Semiya Payasam / Vermicelli Kheer Recipe) . ఈ పేరు, దీని రుచి మీకు కొత్తేం కాకపోవచ్చు. ఎంత సమయం గడిచిన కూడా గట్టిపడని సెమియా పాయసం ఈ సారి మా స్టైల్ చేసి కొత్త రుచిని ఆస్వాదించండి … మరి ఇంకెందుకు ఆలస్యం చేసేద్దాం.

శ్రావణ మాసం సేమియా పాయసం(Semiya Payasam) తయారీ వీడియో:

Semiya Payasam / Vermicelli Kheer Recipe Chef Saru

సేమియా పాయసం (Semiya Payasam / Vermicelli Kheer Recipe) తయారీ విధానం

2.50 from 2 votes
Prep Time 15 minutes
Cook Time 20 minutes
Total Time 35 minutes
Course Main Course
Cuisine Andhra, Andhra Pradesh, Hyderabad
Servings 8

Ingredients
  

  • 100 gms సెమియా
  • 35 gms చెక్కర రుచికి తగ్గట్టు
  • 1 ltr పాలు
  • 1/4 cup నెయ్యి
  • 15 nos జీడి పప్పు
  • 20 nos కిస్మిస్
  • కుంకుమ పువ్వు చిటికెడు
  • 1/2 tbps యాలకుల పోడి

Instructions
 

  • ముందుగా స్టౌ పైన ప్యాన్ పెట్టి రెండు టీ స్పూన్ ల నెయ్యి వేసుకొని నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసి 1 నిమిషం పచ్చి వాసన పొయ్యేలా వేగనిచ్చి ఆ తర్వాత అందులోనే కిస్మిస్ వేసి ఒక పొంగు పొంగేవరకు వేయించాలి. ముందుగా వేసిన జీడిపప్పు లేత బంగారు రంగులోకి వచ్చాక కిస్మిస్, జీడిపప్పు తీసి పక్కన పెట్టుకోవాలి.
    Semiya Payasam / Vermicelli Kheer Recipe Chef Saru
  • ఇప్పుడు అదే ప్యాన్ లో మరింత నెయ్యి వేసి సిద్ద పరుచుకున్న సేమియా వేసి సన్నని మంట పై లేత బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. సన్నని మంట పై అయితేనే సేమియా లోపలి వరకు బాగా వేగుతుంది. సేమియా వేయించేటప్పుడు ఏమాత్రం మాడకుండా చూసుకోవాలి. పాయసం రుచి అంతా సేమియా వేయించే విధానం లోనే ఉంటుంది. పొరపాటున మాడిపోయిందో మంచి రుచి అసలు రాదని గుర్తుపెట్టుకోవాలి.
    Semiya Payasam / Vermicelli Kheer Recipe Chef Saru
  • ఇప్పుడు సేమియా బాగా మంచి లేత బంగారు రంగు లోకి వచ్చిన తరవాత అదే ప్యాన్ లో మనం తీసుకున్న లీటరు పాలలో ఇప్పుడు అర లీటరు పోసుకొని అర లీటరు పాలకు మరో అర లీటరు నీళ్ళు పోసుకొని ఏ మాత్రం పొంగి పోకుండా రెండు పై వరకు పొంగులు వచ్చి కొద్దిగా చిక్కబడెంత వరకు మరగనివాలి.
    Semiya Payasam / Vermicelli Kheer Recipe Chef Saru
  • ఇలా మరిగిన సేమియాలో మరో అరలీటరు పాలు పోసుకొని కాసేపు మరగనిచ్చి అందులో ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ లు సేమియా లో వేసుకొని మరో రెండు టీ స్పూన్ ల నెయ్యి వేసి కలుపుకోవాలి.
    Semiya Payasam / Vermicelli Kheer Recipe Chef Saru
  • ఒక 10 నిమిషాలు కొద్దిగా చిక్కగా బడేవరకు మరగనిచ్చి చివరగా చిటికెడు కుంకుమ పువ్వు వేసుకొని కలిపి దింపుకోవాలి.
    Semiya Payasam / Vermicelli Kheer Recipe Chef Saru
  • ఈ పాయసం ఎంత సమయం గడిచిన గట్టి పడకుండా ఉండాలంటే నేను వాడిన కచ్చితమైన కొలతలు మీరు సరిగ్గా గా పాటించినట్టయితే పాయసం మంచి రుచితో పాటు ఎప్పుడు తిన్న చిక్కగా ఉంటుంది.
    Semiya Payasam / Vermicelli Kheer Recipe Chef Saru

Video

Notes

సేమియా పాయసం వరలక్ష్మి కి ప్రసాదం గా చేశారు కదా… ఎలావుందో తెలియజేయండి. మీ అమూల్య మైన సూచనలు, సలహాలు కామెంట్ రూపం లో మాకు తెలియజేయండి. మరిన్ని రుచులను ఆస్వాదించడానికి చెఫ్ సరు వెబ్ సైట్ ను వీక్షిస్తుండండి.
Keyword chefsaru, payasam, payasam recipe, payasam recipe chef saru, semiya payasam

మీరు ఈ రెసిపీని చదివినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఈ రెసిపీని తయారు చేసి, దాని రుచిని మరియు ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను.

ఇలాంటి మరిన్ని రెసిపీస్ తో పాటు వాటియొక్క విశేషతలు, చిట్కాలు, పోషకాల వివరాలు, మరియు వాటియొక్క ఆరోగ్యప్రయోజనాలను మీరు మీ WhatsApp ద్వారా పొందాలంటే ఇప్పుడే మా WhatsApp ఛానల్ ని Follow చెయ్యండి.

You Can Change Language:

You Can Change Language:

Related Recipes

Choose your favourite recipe

Related Posts

మీ WhatsAppలో CHEF SARU వంటకాలు కావాలా?

ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే మన "Chef Saru" WhatsApp ఛానల్ ని ఫాలో చేసి మేము ప్రచురించే సరికొత్త రెసిపీస్ ని మీ వాట్సాప్ ద్వారా పొందండి.

ట్రెండ్ అవుతున్న రెసిపీస్

సరికొత్త రెసిపీస్

2 thoughts on “సేమియా పాయసం (Semiya Payasam / Vermicelli Kheer Recipe)”

  1. 2 stars
    Hi there this is somewhat of off topic but I was wondering if blogs use WYSIWYG editors or if you have to manually code with
    HTML. I’m starting a blog soon but have no coding
    know-how so I wanted to get advice from someone with
    experience. Any help would be enormously appreciated!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




Scroll to Top

Want CHEF SARU recipes in your WhatsApp?

Subscribe with your WhatsApp number and we will send you new recipes as they are published.

    Powered by 5gworkshop.com