Go Back
Semiya Payasam / Vermicelli Kheer Recipe Chef Saru

సేమియా పాయసం (Semiya Payasam / Vermicelli Kheer Recipe) తయారీ విధానం

Prep Time 15 minutes
Cook Time 20 minutes
Total Time 35 minutes
Course Main Course
Cuisine Andhra, Andhra Pradesh, Hyderabad
Servings 8

Ingredients
  

  • 100 gms సెమియా
  • 35 gms చెక్కర రుచికి తగ్గట్టు
  • 1 ltr పాలు
  • 1/4 cup నెయ్యి
  • 15 nos జీడి పప్పు
  • 20 nos కిస్మిస్
  • కుంకుమ పువ్వు చిటికెడు
  • 1/2 tbps యాలకుల పోడి

Instructions
 

  • ముందుగా స్టౌ పైన ప్యాన్ పెట్టి రెండు టీ స్పూన్ ల నెయ్యి వేసుకొని నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసి 1 నిమిషం పచ్చి వాసన పొయ్యేలా వేగనిచ్చి ఆ తర్వాత అందులోనే కిస్మిస్ వేసి ఒక పొంగు పొంగేవరకు వేయించాలి. ముందుగా వేసిన జీడిపప్పు లేత బంగారు రంగులోకి వచ్చాక కిస్మిస్, జీడిపప్పు తీసి పక్కన పెట్టుకోవాలి.
    Semiya Payasam / Vermicelli Kheer Recipe Chef Saru
  • ఇప్పుడు అదే ప్యాన్ లో మరింత నెయ్యి వేసి సిద్ద పరుచుకున్న సేమియా వేసి సన్నని మంట పై లేత బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. సన్నని మంట పై అయితేనే సేమియా లోపలి వరకు బాగా వేగుతుంది. సేమియా వేయించేటప్పుడు ఏమాత్రం మాడకుండా చూసుకోవాలి. పాయసం రుచి అంతా సేమియా వేయించే విధానం లోనే ఉంటుంది. పొరపాటున మాడిపోయిందో మంచి రుచి అసలు రాదని గుర్తుపెట్టుకోవాలి.
    Semiya Payasam / Vermicelli Kheer Recipe Chef Saru
  • ఇప్పుడు సేమియా బాగా మంచి లేత బంగారు రంగు లోకి వచ్చిన తరవాత అదే ప్యాన్ లో మనం తీసుకున్న లీటరు పాలలో ఇప్పుడు అర లీటరు పోసుకొని అర లీటరు పాలకు మరో అర లీటరు నీళ్ళు పోసుకొని ఏ మాత్రం పొంగి పోకుండా రెండు పై వరకు పొంగులు వచ్చి కొద్దిగా చిక్కబడెంత వరకు మరగనివాలి.
    Semiya Payasam / Vermicelli Kheer Recipe Chef Saru
  • ఇలా మరిగిన సేమియాలో మరో అరలీటరు పాలు పోసుకొని కాసేపు మరగనిచ్చి అందులో ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ లు సేమియా లో వేసుకొని మరో రెండు టీ స్పూన్ ల నెయ్యి వేసి కలుపుకోవాలి.
    Semiya Payasam / Vermicelli Kheer Recipe Chef Saru
  • ఒక 10 నిమిషాలు కొద్దిగా చిక్కగా బడేవరకు మరగనిచ్చి చివరగా చిటికెడు కుంకుమ పువ్వు వేసుకొని కలిపి దింపుకోవాలి.
    Semiya Payasam / Vermicelli Kheer Recipe Chef Saru
  • ఈ పాయసం ఎంత సమయం గడిచిన గట్టి పడకుండా ఉండాలంటే నేను వాడిన కచ్చితమైన కొలతలు మీరు సరిగ్గా గా పాటించినట్టయితే పాయసం మంచి రుచితో పాటు ఎప్పుడు తిన్న చిక్కగా ఉంటుంది.
    Semiya Payasam / Vermicelli Kheer Recipe Chef Saru

Video

Notes

సేమియా పాయసం వరలక్ష్మి కి ప్రసాదం గా చేశారు కదా... ఎలావుందో తెలియజేయండి. మీ అమూల్య మైన సూచనలు, సలహాలు కామెంట్ రూపం లో మాకు తెలియజేయండి. మరిన్ని రుచులను ఆస్వాదించడానికి చెఫ్ సరు వెబ్ సైట్ ను వీక్షిస్తుండండి.
Keyword chefsaru, payasam, payasam recipe, payasam recipe chef saru, semiya payasam