Semiya Payasam / Vermicelli Kheer Recipe:
శ్రావణ మాసం రానే వచ్చింది. మరి ఈ శ్రావణ మాసం లో తెలుగింటి ఆడపడుచుల హడవిడి అంతా ఇంత కాదు అందరూ ఈ మాసం లో చేసుకునే వ్రతం సౌభాగ్యాన్నిచ్చే వరలక్ష్మి వ్రతం, ఎంత చిన్నగా చేసుకున్న అమ్మవారికి కనీసం ఒక మూడు పదార్థాలన్న నివేదన చేస్తారు.
అన్నీ వ్రతాలేమో కానీ వరలక్ష్మి వ్రతానికి మాత్రం ప్రసాదాలే ముఖ్యం. అలాంటి ప్రసాదాల్లో ఒకటే సెమియా పాయసం( Classic Semiya Payasam / Vermicelli Kheer Recipe) . ఈ పేరు, దీని రుచి మీకు కొత్తేం కాకపోవచ్చు. ఎంత సమయం గడిచిన కూడా గట్టిపడని సెమియా పాయసం ఈ సారి మా స్టైల్ చేసి కొత్త రుచిని ఆస్వాదించండి … మరి ఇంకెందుకు ఆలస్యం చేసేద్దాం.
శ్రావణ మాసం సేమియా పాయసం(Semiya Payasam) తయారీ వీడియో:
సేమియా పాయసం (Semiya Payasam / Vermicelli Kheer Recipe) తయారీ విధానం
Ingredients
- 100 gms సెమియా
- 35 gms చెక్కర రుచికి తగ్గట్టు
- 1 ltr పాలు
- 1/4 cup నెయ్యి
- 15 nos జీడి పప్పు
- 20 nos కిస్మిస్
- కుంకుమ పువ్వు చిటికెడు
- 1/2 tbps యాలకుల పోడి
Instructions
- ముందుగా స్టౌ పైన ప్యాన్ పెట్టి రెండు టీ స్పూన్ ల నెయ్యి వేసుకొని నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసి 1 నిమిషం పచ్చి వాసన పొయ్యేలా వేగనిచ్చి ఆ తర్వాత అందులోనే కిస్మిస్ వేసి ఒక పొంగు పొంగేవరకు వేయించాలి. ముందుగా వేసిన జీడిపప్పు లేత బంగారు రంగులోకి వచ్చాక కిస్మిస్, జీడిపప్పు తీసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే ప్యాన్ లో మరింత నెయ్యి వేసి సిద్ద పరుచుకున్న సేమియా వేసి సన్నని మంట పై లేత బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. సన్నని మంట పై అయితేనే సేమియా లోపలి వరకు బాగా వేగుతుంది. సేమియా వేయించేటప్పుడు ఏమాత్రం మాడకుండా చూసుకోవాలి. పాయసం రుచి అంతా సేమియా వేయించే విధానం లోనే ఉంటుంది. పొరపాటున మాడిపోయిందో మంచి రుచి అసలు రాదని గుర్తుపెట్టుకోవాలి.
- ఇప్పుడు సేమియా బాగా మంచి లేత బంగారు రంగు లోకి వచ్చిన తరవాత అదే ప్యాన్ లో మనం తీసుకున్న లీటరు పాలలో ఇప్పుడు అర లీటరు పోసుకొని అర లీటరు పాలకు మరో అర లీటరు నీళ్ళు పోసుకొని ఏ మాత్రం పొంగి పోకుండా రెండు పై వరకు పొంగులు వచ్చి కొద్దిగా చిక్కబడెంత వరకు మరగనివాలి.
- ఇలా మరిగిన సేమియాలో మరో అరలీటరు పాలు పోసుకొని కాసేపు మరగనిచ్చి అందులో ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ లు సేమియా లో వేసుకొని మరో రెండు టీ స్పూన్ ల నెయ్యి వేసి కలుపుకోవాలి.
- ఒక 10 నిమిషాలు కొద్దిగా చిక్కగా బడేవరకు మరగనిచ్చి చివరగా చిటికెడు కుంకుమ పువ్వు వేసుకొని కలిపి దింపుకోవాలి.
- ఈ పాయసం ఎంత సమయం గడిచిన గట్టి పడకుండా ఉండాలంటే నేను వాడిన కచ్చితమైన కొలతలు మీరు సరిగ్గా గా పాటించినట్టయితే పాయసం మంచి రుచితో పాటు ఎప్పుడు తిన్న చిక్కగా ఉంటుంది.
Video
Notes
మీరు ఈ రెసిపీని చదివినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఈ రెసిపీని తయారు చేసి, దాని రుచిని మరియు ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను.
ఇలాంటి మరిన్ని రెసిపీస్ తో పాటు వాటియొక్క విశేషతలు, చిట్కాలు, పోషకాల వివరాలు, మరియు వాటియొక్క ఆరోగ్యప్రయోజనాలను మీరు మీ WhatsApp ద్వారా పొందాలంటే ఇప్పుడే మా WhatsApp ఛానల్ ని Follow చెయ్యండి.