Arati Puvvu Vadalu / Banana Flower Vadalu:
అరటి చెట్టు… అందరికీ సూపరిచితమే… దాని నుండి వచ్చే అరటి పళ్ళు తినని వారు వుండరు అంటే ఆశ్చర్యం లేదు. ప్రకృతి లో సహాజ సిద్ధం గా లభించే పదార్థాలతో అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాంటి పదార్థాలలో ఒకటి అరటి పువ్వు.
అరటి పండు తరహాలోనే అరటి పువ్వు లో కూడా అనేక పోషకాలు ఉన్నాయి. ఒక రకం గా చెప్పాలంటే అరటి పండు లో కన్న పువ్వు లోనే ఎక్కువ పోషకాలు ఉన్నాయి. కానీ అరటి పువ్వు తినే వారు చాలా తక్కువగానే కనపడుతుంటారు. ముఖ్యం గా తెలంగాణ లో కంటే కోస్తా ప్రాంతం లో ఈ అరటి పువ్వు ను ఎక్కువగా వినియోగిస్తుంటారు.
ఈ అరటి పువ్వుతో కూర, వేపుడు, మసాలా కూరలు, పకోడీ, వడలు ఇలా ఎన్నో రకాలుగా చేస్తుంటారు. అరటి పువ్వు (Banan Flower) రుచి లోనే కాదు, అది ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను ఇవ్వడం లో కూడా ముందంజలో ఉంటుంది.
అరటి పువ్వు సంతాన సమస్యలను దూరం చేసి పురుషుడిలోని వీర్య వృద్దికి తోడ్పడుతుంది. అరటి పువ్వులో వుండే విటమిన్ సి శరీరం లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
అరటి పువ్వులో ఉండే ఐరన్, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్ మొదలయినవి నాడీ వ్యవస్థను సక్రమంగా పని చేసెట్టు చేస్తాయి. అంతే కాకుండా స్త్రీ ల గర్భాశయ సమస్యలకు, గ్యాస్, అసిడిటీ, డయాబెటిస్, హై బీపీ,కి డ్నీ లలో రాళ్ళ నివారణ కు ఇంకా అనేక రకాల సమస్యలకు మంచి ఔషదం అరటి పువ్వు. కానీ దీనిని చూస్తేనే చాలా మంది పారిపోతారు.
అలాంటి వారికోసం ఇలా చేసి పెట్టండి. మరలా మరలా అడిగి మరి చేయించుకొని తింటారు. ఎంతో రుచికరంగా, సులభంగా చేసుకునే అరటి పువ్వు వడలు(Arati Puvvu Vadalu) చేసేద్దాం పదండి.
అరటి పువ్వు వడలను మరింత రుచిగా మార్చేందుకు కొన్ని టిప్స్:
- అరటి పువ్వు వడలకు కొద్దిగా ముదిరిన అరటి పువ్వు అయితే వడలు తింటున్నప్పుడు క్రిస్పీ, క్రిస్పీ గా చాలా బాగుంటాయి. ముదిరిన పువ్వు వల్ల వడలు మరింత రుచికరం గా ఉంటాయి.
- అరటి పువ్వు తురుముకున్న తరువాత తురిమిన పువ్వును ఉప్పు నీటిలో 10 నిమిషాల పాటు నానపెట్టు కోవాలి. (ఇలా చేయడం వల్ల అరటి పువ్వుకు ఉన్న జిగురు పోతుంది.)
- కంది పప్పు, శనగ పప్పును నాన పెట్టె ముందు కొద్దిగా దోరగా వేయించి నానపెట్టుకుంటే పిండికి ఒక కొత్త రుచి వస్తుంది.
- వడలు వేయించడానికి వేరుశనగ నూనె వాడితే మరింత రుచిగా వస్తాయి. లేని వారు మామూలు నునే అయిన వాడుకోవచ్చు.
- వేయించే ముందు సన్నని మంట పెట్టి మాత్రమే వేయించు కోవాలి. పెద్ద మంట పైన త్వరగా వేగుతాయి, కానీ లోపల అలాగే పచ్చి పచ్చి గానే ఉంటాయి. సన్నని మంట పైన మాత్రమే లోపలి వరకు బాగా వేగుతాయి. కొద్దిగా వేగడానికి సమయం పట్టిన సరే గాని సన్నని మంట పైననే వేయించుకోండి.
- ఉప్పు నీళ్ళలోనుంచి తీసిన అరటి పువ్వును కొద్దిగా ఉప్పు వేసి బాగా నలిపి పిండి మిశ్రమం లో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది.
కరకరలాడే, రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన అరటి పువ్వు వడలు రెసిపీ!
Ingredients
- 2 కప్పులు అరటి పువ్వు తురుము
- ½ కప్పు కంది పప్పు
- 1 కప్పు శనగ పప్పు
- ¼ కప్పు బియ్యం పిండి
- 1 కప్పు ఉల్లి తరుగు
- చిన్న ముక్క అల్లం
- 5 ఎండు మిర్చి
- 1 టీ స్పూన్ పసుపు
- 1 టీ స్పూన్ సొంపు
- ½ కప్పు కరివేపాకు తురుము
- ¼ కప్పు కొత్తిమీర తురుము
- 1 స్పూన్ ఇంగువ
- తగినంత ఉప్పు
- వేయించడానికి సరిపడా నూనె
Instructions
- మొదట అరటి పువ్వు చిన్నగా తరిగి తరిగిన మిశ్రమాన్ని ఒక 10 నిమిషాల పాటు ఉప్పు నీటిలో వేసి నానపెట్టి తీసి పక్కన పెట్టుకోవాలి . ఇలా చేయడం వలన అరటి పువ్వుకు వున్న వగరు పోతుంది. దానివల్ల వడలు మంచి రుచిగా ఉంటాయి.
- ముందుగా శనగ పప్పును, కంది పప్పును విడివిడిగా ఒక 3 గంటల పాటు నానపెట్టుకోవాలి.
- పప్పు బాగా నానిన తరువాత నీళ్ళన్నీ తీసేసి కంది పప్పు, శనగ పప్పు రెండు కలిపి అందులోనే ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, సొంపు, వేసి మరి మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ముఖ్యం గా సొంపు ఇందులో వేయడం ద్వారా వడలు మంచి రుచిని ఇస్తాయి.
- ఇప్పుడు ఒక పిండి కలుపు కోవడానికి అనువుగా ఉండేటువంటి గిన్నె తీసుకొని అందులో ముందుగా తురిమి పెట్టుకున్న అరటి పువ్వు తురుము, కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము, సన్నగా తరిగిన పచ్చి మిర్చి ముక్కలు, పసుపు, ఇంగువ, సరిపడా ఉప్పు, ఉల్లిపాయ తరుగు, బియ్యం పిండి వేసి బాగా కలుపు కోని పక్కన పెట్టుకోవాలి. ఉప్పు ఇప్పుడు అయిన వేసుకోవచ్చు. లేదా పప్పులు మిక్సీ పట్టే సమయం లో నైనా వేసుకోవచ్చు ఎవరికి నచ్చి నట్టు వారు వేసుకున్న ఇబ్బంది లేదు.
- ఇప్పుడు స్టౌ పైన ముకుడు పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోసి నూనె బాగా వేడయ్యాక చిన్న అరటి ఆకు ముక్క తీసుకొని దాని పైన మామూలు పప్పు వడల విధంగా చేసుకొని నూనెలో బాగా లేత బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి.వడలు వోత్తుకునేప్పుడు మామూలుగా చేతిపైన వస్తే చేసుకోవచ్చు ఒక వేల రాదు అంటే అరటి ఆకు పైన చేసుకోవచ్చు. కచ్చితంగా అరటి ఆకు పైననే చేయాలన్న నియమం ఏమి లేదని గుర్తుంచుకోండి.
- ఇలా ఒక దాని తరవాత ఒకటి బాగా వేయించుకొని పక్కన తీసుకుంటే సరి. మంచి రుచి తో ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే అరటి పువ్వు వడలు రడి ఐనట్టే అరటి పువ్వటే అమ్మో అన్నవాళ్లు అమ్మ ఎంత రుచిగా ఉన్నాయో అని వీటిని తిన్న వాళ్ళు కచ్చితం గా మళ్ళీ మళ్ళీ కావలంటారు. మరి మీరు చేసుకొని తినేయండి.
Notes
మీరు ఈ రెసిపీని చదివినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఈ రెసిపీని తయారు చేసి, దాని రుచిని మరియు ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను.
ఇలాంటి మరిన్ని రెసిపీస్ తో పాటు వాటియొక్క విశేషతలు, చిట్కాలు, పోషకాల వివరాలు, మరియు వాటియొక్క ఆరోగ్యప్రయోజనాలను మీరు మీ WhatsApp ద్వారా పొందాలంటే ఇప్పుడే మా WhatsApp ఛానల్ ని Follow చెయ్యండి.