Go Back
Arati Puvvu Vadalu / Banan Flower Vadalu / Vazhaipoo Vada Recipe

కరకరలాడే, రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన అరటి పువ్వు వడలు రెసిపీ!

Prep Time 30 minutes
Cook Time 20 minutes
Total Time 50 minutes
Course Breakfast, Snack
Cuisine Andhra, Andhra Pradesh, Indian, south indian, Telangana
Servings 4

Ingredients
  

  • 2 కప్పులు అరటి పువ్వు తురుము
  • ½ కప్పు కంది పప్పు
  • 1 కప్పు శనగ పప్పు
  • ¼ కప్పు బియ్యం పిండి
  • 1 కప్పు ఉల్లి తరుగు
  • చిన్న ముక్క అల్లం
  • 5 ఎండు మిర్చి
  • 1 టీ స్పూన్ పసుపు
  • 1 టీ స్పూన్ సొంపు
  • ½ కప్పు కరివేపాకు తురుము
  • ¼ కప్పు కొత్తిమీర తురుము
  • 1 స్పూన్ ఇంగువ
  • తగినంత ఉప్పు
  • వేయించడానికి సరిపడా నూనె

Instructions
 

  • మొదట అరటి పువ్వు చిన్నగా తరిగి తరిగిన మిశ్రమాన్ని ఒక 10 నిమిషాల పాటు ఉప్పు నీటిలో వేసి నానపెట్టి తీసి పక్కన పెట్టుకోవాలి .
    ఇలా చేయడం వలన అరటి పువ్వుకు వున్న వగరు పోతుంది. దానివల్ల వడలు మంచి రుచిగా ఉంటాయి.
    arati puvvu
  • ముందుగా శనగ పప్పును, కంది పప్పును విడివిడిగా ఒక 3 గంటల పాటు నానపెట్టుకోవాలి.
  • పప్పు బాగా నానిన తరువాత నీళ్ళన్నీ తీసేసి కంది పప్పు, శనగ పప్పు రెండు కలిపి అందులోనే ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, సొంపు, వేసి మరి మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి.
    ముఖ్యం గా సొంపు ఇందులో వేయడం ద్వారా వడలు మంచి రుచిని ఇస్తాయి.
  • ఇప్పుడు ఒక పిండి కలుపు కోవడానికి అనువుగా ఉండేటువంటి గిన్నె తీసుకొని అందులో ముందుగా తురిమి పెట్టుకున్న అరటి పువ్వు తురుము, కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము, సన్నగా తరిగిన పచ్చి మిర్చి ముక్కలు, పసుపు, ఇంగువ, సరిపడా ఉప్పు, ఉల్లిపాయ తరుగు, బియ్యం పిండి వేసి బాగా కలుపు కోని పక్కన పెట్టుకోవాలి. ఉప్పు ఇప్పుడు అయిన వేసుకోవచ్చు. లేదా పప్పులు మిక్సీ పట్టే సమయం లో నైనా వేసుకోవచ్చు ఎవరికి నచ్చి నట్టు వారు వేసుకున్న ఇబ్బంది లేదు.
    Banan Flower Vadalu
  • ఇప్పుడు స్టౌ పైన ముకుడు పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోసి నూనె బాగా వేడయ్యాక చిన్న అరటి ఆకు ముక్క తీసుకొని దాని పైన మామూలు పప్పు వడల విధంగా చేసుకొని నూనెలో బాగా లేత బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి.
    వడలు వోత్తుకునేప్పుడు మామూలుగా చేతిపైన వస్తే చేసుకోవచ్చు ఒక వేల రాదు అంటే అరటి ఆకు పైన చేసుకోవచ్చు. కచ్చితంగా అరటి ఆకు పైననే చేయాలన్న నియమం ఏమి లేదని గుర్తుంచుకోండి.
    Vazhaipoo Vada Recipe
  • ఇలా ఒక దాని తరవాత ఒకటి బాగా వేయించుకొని పక్కన తీసుకుంటే సరి. మంచి రుచి తో ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే అరటి పువ్వు వడలు రడి ఐనట్టే అరటి పువ్వటే అమ్మో అన్నవాళ్లు అమ్మ ఎంత రుచిగా ఉన్నాయో అని వీటిని తిన్న వాళ్ళు కచ్చితం గా మళ్ళీ మళ్ళీ కావలంటారు. మరి మీరు చేసుకొని తినేయండి.
    Arati Puvvu Vadalu

Notes

బాగున్నాయా అరటి పువ్వు వడలు... ఇలాంటి మరిన్ని మంచి నోరూరించే రుచుల కోసం మా చెఫ్ సరు వెబ్ సైట్ ని వీక్షిస్తుండండి. మీ సలహాలు, సూచనలను కామెంట్ రూపం లో మాకు తెలియజేయండి.
Keyword Arati Puvvu Vadalu, Arati Puvvu Vodalu, Arati Vadalu, Arati Vodalu, Banana Flower Vada, Banana Leaf Vadalu, Banana Vadalu, beakefast recipes, snacks, snacks recipes telugu