Tomato nuvvula pachadi/Tomato Sesame Chutney: పుల్ల పుల్లగా కమ్మగా కారంగా ఉండే ఎంతో రుచికరమైన చట్నీ టమాటా నువ్వుల పచ్చడి. ఇది అన్నంలోకి ,చపాతి, దోసెలోకి చాలా రుచిగా ఉంటుంది.
క్యాల్షియం తక్కువగా ఉన్న వారికి నువ్వులు చాలా మంచిది. తెల్ల నువ్వులతో పచ్చడి చేస్తే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.
చలి కాలం లో నువ్వుల తో పచ్చడి చేసుకుంటే శరీరానికి వెచ్చదనం.
ఈ పచ్చడి చేయడం ఎంత తెలీకొ అంత రుచి . అత్తమ్మ చెప్పినట్టు చేస్తే గనుక మీ ఇంటిల్లిపాది కమ్మగా లొట్టలేస్తూ తింటారు.
ఇలాంటి మరిన్ని రెసిపీస్ తో పాటు వాటియొక్క విశేషతలు, చిట్కాలు, పోషకాల వివరాలు, మరియు వాటియొక్క ఆరోగ్యప్రయోజనాలను మీరు మీ WhatsApp ద్వారా పొందాలంటే ఇప్పుడే మా WhatsApp ఛానల్ ని Follow చెయ్యండి.
ఈ టిప్స్ ఫాలో అవ్వండి పచ్చడి కి మరింత రుచి వస్తుంది:
- నువ్వులకు బదులు వేయించిన అవిసె గింజలు పుట్నాల పప్పు పచ్చిశనగపప్పు కూడా వాడుకోవచ్చు.
- చలికాలంలో నువ్వులతో చేసుకుంటేనే శరీరానికి చక్కటి వేడిని ఇస్తుంది.
- ఈ పచ్చడికి ఎండు మిరపకాయల కన్నా పచ్చిమిర్చి చాలా రుచిగా ఉంటుంది.
- ఈ పచ్చడిలో పచ్చిమిర్చి ఎక్కువగా ఉండాలి ఎందుకంటే నువ్వుల వల్ల చెప్పదని వస్తుంది అందుకే రెండు మూడు ఎక్కువగా వాడుకోవాలి.
- వెల్లుల్లి తాలింపులో వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. ఒకవేళ వెల్లుల్లి వాడని వాళ్లయితే వేయకపోయినా పరవాలేదు దాని ప్లేస్ లో కాసింత ఇంగువ వేసుకోండి.
- అన్నంలోకి కచ్చాపచ్చాగా అంటే కొద్దిగా ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుంటుంది టిఫిన్ లోకి అయితే మెత్తగా పేస్టులా చేస్తే బాగుంటుంది.
- నాటు టమాటాలు అయితే పచ్చడి పుల్లగా చాలా రుచిగా ఉంటుంది.
- ఎక్కువ పులుపు కావాలనుకునేవారు కాస్త చింతపండు వాడుకోవచ్చు కానీ టమాటా పండు నుంచి వచ్చే పులుపు ఈ పచ్చడికి చాలా రుచినిస్తుంది.
- నా సలహా అయితే చింతపండు వాడకపోవడం మంచిది.
- ఈ పచ్చడి ఎండాకాలంలో ఒకరోజు కంటే ఎక్కువగా నిలువ ఉండదు.,చలి కాలం అయితే 1 రోజు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 3 నాలుగు రోజుల వరకు పాడవ్వ కుండా ఉంటుంది.
- ఈ పచ్చడి(Tomato nuvvula pachadi/Tomato Sesame Chutney) చేయడం చాలా సులభంగా ఉంది కదా అత్తమ్మ చెప్పినట్టుగా ఈ టిప్స్ తో చేస్తే ఆ రుచి వేరే లెవెల్ లో ఉంటుంది మీరు తప్పకుండా ప్రయత్నం చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన chef saru వెబ్సైట్ ని ఫాలో అవ్వండి.
టమాటా నువ్వుల పచ్చడి
Ingredients
- ½ kg పండు టమాటాలు
- 10 పచ్చిమిర్చి
- 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు
- 5 – 6 వెల్లుల్లి రెబ్బలు
- 1 స్పూను ధనియాలు
- కొద్దిగా కొత్తిమీర
- 3 టేబుల్ స్పూన్ల నూనె
- రుచికి సరిపడా ఉప్పు
తాలింపుకు కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దాం
- 1 రెబ్బ కరివేపాకు
- ½ స్పూన్ శనగపప్పు
- 2 స్పూన్ల నూనె
- ¼ స్పూన్ జీలకర్ర
- 2 వెల్లుల్లి ( కచ్చాపచ్చా దంచాలి )
Instructions
- కడాయిలో పచ్చిమిర్చి వేసి సగం వరకు వేగాక ధనియాలు జీలకర్ర వెల్లుల్లి కొత్తిమీర వేసి ఇవన్నీ చివరగా నువ్వులు వేసి దోరగా వేయించుకుని ఇవన్నీ మరొక బౌల్ లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో నూనె వేసి అందులో టమాటా ముక్కలు వేసి బాగా మగ్గనివ్వండి.
- తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న వాటిని మిక్సీ జార్ లో వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అత్తమ్మ అయితే ఒకటిన్నర స్పూన్ల ఉప్పు వేసింది మీరైతే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి.
- పచ్చిమిర్చి ఆ మిగిలిన వేయించుకున్న పదార్థాలన్నీ మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మనం మగ్గించుకున్న టమాటాలు తీసుకొని దాంట్లో వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి అప్పుడే మీకు రోల్ లో నూరుకున్న ఫీలింగ్ ఉంటుంది.
- ఇవన్నీ నూరుకున్నారు సరే మరి తాలింపు పెట్టుకోవాలి కదా… అందుకే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఆ పాన్ బాగా వేడి అయ్యాక రెండు స్పూన్ల నూనె వేసుకొని నూనె కొద్దిగా వేడి అయ్యాక. రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. అర టీ స్పూను శనగపప్పు వేసి కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు రెబ్బల కరివేపాకు చిటికెడంత పసుపు కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేగాక రుబ్బుకున్న పచ్చడిలో వేసుకోండి.
- అంతే మంచి రుచికరమైన టమాటా పచ్చడి రెడీ.
మీరు ఈ రెసిపీని చదివినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఈ రెసిపీని తయారు చేసి, దాని రుచిని మరియు ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను.
ఇలాంటి మరిన్ని రెసిపీస్ తో పాటు వాటియొక్క విశేషతలు, చిట్కాలు, పోషకాల వివరాలు, మరియు వాటియొక్క ఆరోగ్యప్రయోజనాలను మీరు మీ WhatsApp ద్వారా పొందాలంటే ఇప్పుడే మా WhatsApp ఛానల్ ని Follow చెయ్యండి.