మైసూర్ బోండా అనేది దక్షిణ భారతదేశానికి చెందిన ఒక ప్రసిద్ధ టిఫిన్ . ఇది సహజంగా మైదా పిండితో తయారు చేస్తారు కొబ్బరి చట్నీతో ఈ బొండాలు తింటే ఉంటుంది అబ్బా😍 .
Mysore Bonda Recipe with Wheat Flour: దీన్ని మనం గోధుమ పిండితో కూడా తయారు చేయవచ్చు. గోధుమ పిండి మైసూర్ బోండా(Mysore Bonda Recipe with Wheat Flour) , మైదా పిండి బొండా అంత రుచిగా ఉంటుంది, అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది . అది ఎలా అంటే గోధుమ పిండి లో పుష్కలంగా ఫైబర్ మరియు ప్రోటీన్ లు ఉంటాయి . ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి .
ఫైబర్ యొక్క ప్రయోజనాలు:
- ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
- ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
- ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ప్రోటీన్ యొక్క ప్రయోజనాలు:
- ప్రోటీన్ కండరాల నిర్మాణానికి మరియు వాటిని రిపైరు చేయడానికి సహాయపడుతుంది .
- ప్రోటీన్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
- ప్రోటీన్ కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది దీంతో వైట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చక్కటి ఆహారం

గోధుమపిండి తో మైసూర్ బోండా తయారు చేసే విధానం: (Mysore Bonda Recipe with Wheat Flour)
మైసూర్ బోండా
Ingredients
- 400 gms గోధుమ పిండి
- 2 tbps బొంబాయి రవ్వ
- 1/2 cup పెరుగు
- 1/2 tbps వంట సోడా
- 1/4 cup చిన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు
- 2 tbps జీలకర్ర
- 4 పచ్చి మిర్చి
- ఉప్పు రుచికి సరిపడా
- చిన్న కప్పు కరివేపాకు తరుగు
- చిన్న కప్పు కొత్తిమీర తరుగు
Instructions
- ముందుగా వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో వంట సోడా వేయాలి . వంట సోడా ఎప్పుడు కూడా తాజాది తీసుకోవాలి అప్పుడే బొండాలు బాగా పొంగుతాయి . వంట సోడా వేసిన దాని లోనే అరకప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి . పుల్లటి పెరుగు అయితే మరి మంచిది . సోడా ,పెరుగు కలిసి బాగా పొంగుతుంది . ఆ తర్వాత దానిలోనే బొంబాయి రవ్వ వేసి బాగా కలిపి ఇందులోనే గోధుమ పిండి వేసి తగినన్ని నీళ్ళు పోసి మరి జారుగా కాకుండా బోండా కి అవసరమయ్యే విధం గా పిండిని కలుపుకోవాలి .400 గ్రాముల పిండికి సరిగ్గా అరలీటరు నీళ్ళు అవసరమవతాయి.
- ఈ పిండి నంతా బాగా 10 నిమిషాల పాటు బాగా గిలకొట్టుకోవాలి . ఇక్కడ ఒక విషయం గుర్తుపెటుకోవాలి . పిండిని ఎంత బాగా గిలకొట్టుకుంటే గాలి పిండి లోకి అంతా బాగా చొరబడి పిండి బాగా పొంగుతుంది . బొండాలు బాగా గుండ్రం గా మెత్తగా వస్తాయి . బోండాలు బాగా రావడం రాకపోవడం అనేది అంతా మనం పిండి ని గిలకొట్టుకోవడం లోనే ఉంది . కొద్దిగా నీటిని చేతికి తగిలించుకొని గిన్నె అంచులకు పట్టిన పిండిని అంతా శుభ్రం చేసుకోవాలి . లేదంటే ఆ పిండి అంతా ఎండి పొయ్యి బోండా పిండిలో కలిసి బొండాలు వేసే సమయం లో ఇబ్బంది అవుతుంది . ఇలా గిల కొట్టుకున్న పిండి ని ఒక 2 గంటల పాటు అలానే వదిలేయాలి .
- ఇప్పుడు 2 గంటలు బాగా నానిన పిండిని తీసుకొని ఒక సారి బాగా కలిపి అందులో సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు ,పచ్చిమిర్చి ముక్కలు ,కరివేపాకు తిరుము ,కొత్తిమీర తురుము ,జీలకర్ర వేసి మరో 10 నిమిషాలు గిలకొట్టి పక్కన పెట్టాలి .
- స్టౌ పైన కడాయి పెట్టి అందులో బోండాలు వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి . కడాయి మరి సన్నది కాకుండా లావు పాటిది అయితే బొండాలు మాడిపోకుండా ఉంటాయి . కొద్దిగా లోతుగా ఉన్న కడాయి అయితే బోండాలు నూనెలో మునిగి బాగా కాలతాయి .
- నూనె వేడయ్యాక బోండా పిండిని తీసుకొని మామూలు బొండాలు వేసుకున్నట్టే వేసుకొని మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి . సన్నని మంట పైననే బోండాలను వేయించుకోవాలి . అప్పుడే బోండా లోపలి వరకు బాగా కాలుతుంది . పెద్ద మంట పై అయితే బాగానే కలుతుంది కానీ లోపల అంతా పిండి పిండి గానే ఉంటుంది .
- కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఎన్ని కావాలి అంటే అన్ని బోండాలు వేసుకోవడమే అంతే ఎంతో రుచిగా కొత్తగా అనిపించే గోధుమ పిండి బొండాలు రెడీ .
Video
Notes
మైసూర్ బొండా (గోధుమ పిండితో తయారు చేసినది) పోషణ పట్టిక: (Mysore Bonda Recipe with Wheat Flour: Nutrition Table)
Nutrient | Per serving: 1 Bonda (50 grams) |
---|---|
Calories | 120 |
Fat | 4 grams |
Saturated fat | 1 gram |
Unsaturated fat | 2 grams |
Polyunsaturated fat | 1 gram |
Protein | 5 grams |
Carbohydrates | 20 grams |
Dietary fiber | 3 grams |
Sugar | 2 grams |
Sodium | 150 milligrams |
Potassium | 200 milligrams |
Vitamin C | 5% |
Vitamin B6 | 5% |
Iron | 5% |
Calcium | 5% |
ఈ చట్నీలలో మైసూర్ బొండాలు తింటే సూపర్ ఉంటాయి :
- కొబ్బరి చట్నీ: ఇది కొబ్బరి, పచ్చి మిరపకాయలు, అల్లం మరియు కొత్తిమీర ఆకులతో తయారు చేసిన ఒక సాంప్రదాయ దక్షిణ భారత చట్నీ. ఇది మైసూర్ బొండాలలో అద్బుతంగా ఉంటుంది .
- టమాటా చట్నీ: ఈ చట్నీ టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు మరియు మసాలాలతో తయారు చేయబడుతుంది. ఈ టమాటా చట్నీ లో మైసూర్ బొండాలను అలా అలా నంజుకుని తింటే ఉంటుంది 😋అబ్బా సూపర్ .
- పుదీనా చట్నీ: ఈ చట్నీ పుదీనా ఆకులు, పచ్చి మిరపకాయలు, అల్లం కొత్తిమీర ఆకులతో తయారు చేస్తారు . కొంచెం కొత్త రుచి కావాలనుకునే వారికి ఇది సూపర్ చట్నీ .
- చట్నీ పొడి: ఇది కొత్తిమీర, జీలకర్ర, ఎర్ర మిరపకాయ పొడి మరియు పసుపు పొడి ఇవన్నీ వేసి చేసే చట్నీ పొడి. సాధారణంగా చట్నీని తయారు చేయడానికి నీటితో లేదా పెరుగుతో కలుపుతారు. ఇది కూడా సూపర్ ఉంటుంది .
మైసూర్ బొండాలు వేరుశనగ చట్నీ, ఉల్లిపాయ చట్నీ లేదా అల్లం చట్నీ ఇలా ఏ చట్నీ లో అయిన ట్రై చేయండి సూపర్ ఉంటాయి . మీకు కావలసిన చట్నీ చేసుకుని కొత్త కొత్త గా రుచి చూసేయండి మరి .

గోధుమ పిండితో తయారు చేసిన మైసూర్ బోండా యొక్క ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు:
ప్రయోజనాలు:
- ఫైబర్ మరియు ప్రోటీన్‌కు మంచి మూలం: గోధుమ పిండిలో ఫైబర్ మరియు ప్రోటీన్ ఉండడం వల్ల ఇది త్వరగా జీర్ణం అవుతుంది . . ఫైబర్ శరీరం లో ఉన్న గ్లూకోస్ స్థాయిలను కూడా నియంత్రిస్తుంది . అదే విధంగా ప్రోటీన్ కూడా అధికంగా ఉంటుంది మీరు 4 బొండాలు తినగానే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది దీంతో త్వరగా weight loss అవుతారు అలాగే శరీరం లోని కొవ్వు కూడా త్వరాగా కరుగుతుంది . ప్రోటీన్ రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది
- తక్కువ కేలరీలు మరియు తక్కువ కొవ్వు కలిగిన స్నాక్: ఒక బొండాలో సుమారు 120 కేలరీలు మరియు 4 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు మంచి ఎంపిక.
- విటమిన్ సి, విటమిన్ బి6, ఐరన్ మరియు కాల్షియం వంటి పోషకాలకు మంచి మూలం: మైసూర్ బొండాలో విటమిన్ సి, విటమిన్ బి6, ఐరన్ మరియు కాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరానికి చాలా అవసరం .
అప్రయోజనాలు:
- సోడియం అధికంగా ఉంటుంది: మైసూర్ బోండాలో సోడియం అధికంగా ఉంటుంది, కాబట్టి అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు మితంగా తినాలి.
ముగింపు:
గోధుమ పిండితో తయారు చేసిన మైసూర్ బోండా(Mysore Bonda Recipe with Wheat Flour) అనేది మితంగా తింటేనే ఆరోగ్యం . ఇది ఫైబర్, ప్రోటీన్ మరియు పోషకాలకు మంచి మూలం. అయితే, ఇందులో సోడియం అధికంగా ఉంటుంది మరియు వేయించి తయారు చేస్తారు, కాబట్టి ఎక్కువగా తినడం మంచిది కాదు.
గమనిక: మైసూర్ బోండాను తయారు చేసేటప్పుడు, తక్కువ నూనెను ఉపయోగించి వేయించడం మంచిది. నూనె అంటే ఇష్టం లేని వాళ్ళు ఇడ్లీ పాత్రలో ఉడికించి పైన చెప్పిన చట్నీ లో ట్రై చేయండి అది కూడా సూపర్ ఉంటుంది .
4 thoughts on “గోధుమపిండితో మైసూర్ బోండా | Mysore Bonda Recipe”
రాగి ముద్ద/సంకటి తయారు చేసి చుయించండి saru garu అత్తమ్మ తో
త్వరలో తప్పకుండా చేస్తా సిస్టర్ 😍
Nice one
tq