Chepala pulusu / Fish curry (Nellore chepala pulusu) / Chepala kura / Chepala curry / Fish pulusu / Andhra & Telangana style fish curry :
నాన్ వెజ్ ప్రియులలో చేపల పులుసు ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు చెప్పండి. అవును అండి నాకు చేపల పులుసు అంటే ప్రాణం కానీ చేపల పులుసు (Chepala kura recipe / Nellore chepala pulusu) చేయడం చాలా కష్టం అనుకుంటూ ఉంటారు చాలామంది… కానీ సరిగ్గా మసాలాలు దట్టించి అత్తమ్మ చెప్పినట్టు చేయలే కానీ ప్లేట్ కూడా నాకే ఇస్తారంటే అతిశయోక్తి కాదు.
ఈ చేపల కూర ఏమాత్రం తేడా కొట్టిన తినలేము. అందుకే చేపల కూర వండాలంటే చాలామంది నేను చేయను బాబోయ్ అంటారు. అలాంటి వారి కోసమే అత్తమ్మ ఈ రోజు కొన్ని సీక్రెట్స్ చెప్పింది. అమ్మమ్మలు, నాన్నమ్మల కాలంనాటి పల్లెటూరు పద్ధతిలో అప్పటికప్పుడే మసాలాలను రోట్లో నూరి చాపల కూర చేసుకునే పద్ధతిని మనకోసం ఈరోజు చెప్పింది. ఇలా చేసి తిన్నారంటే జన్మలో మర్చిపోరు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం రుచికరమైన చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామా.
చేపల పులుసు ను మరింత రుచిగా చేయడానికి చిట్కాలు:
- చేప ముక్కలు సరిగ్గా కడగకపోతే నీచు వాసన వస్తుంది. అందుకే రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి మనకు వీలుంటే బండమీద ఒక్కొక్క ముక్కను శుభ్రంగా రుద్దుకొని కడుక్కోవాలి.
- చేపలను మరీ ఎక్కువగా ఉడికిస్తే అవి విరిగిపోయి కూరలో కలిసిపోతాయి. కూరని మాటిమాటికీ గరిటెతో కలిపితే కూడా అలాగే అవుతుంది.
- ఈ చేపల పులుసులో చిన్న సైజు వంకాయలు, మునక్కాయలు, బెండకాయలు కూడా వేసి వండుకోవచ్చు.
- చేపల పులుసు తయారీకి ఎంచుకునే పాత్ర వెడల్పాటిదై ఉండాలి.
- బయట దొరికే మసాలాలు కాకుండా అప్పటికప్పుడు మనం తయారు చేసుకునే మసాలాలు అయితే చేపల కూర చాలా రుచిగా వస్తుంది.
- ఇది పక్కా తెలంగాణ స్టైల్ చేపల పులుసు అన్నంలోనే కాదు ఇడ్లీ ,దోస, వడ, గారెలు ఇలా వేటిలో నైనా చాలా టేస్ట్ గా ఉంటాయి .
- ఈ చేపల పులుసు పాడవకుండా మూడు రోజుల వరకు ఉంటుంది.
- మరుసటి రోజు చేపల పులుసు తినాలి అనుకునేవారు పులుసు పలుచగా పెట్టుకోండి పులుసు చల్లారే కొద్ది చిక్కబడుతుంది.
చేపల పులుసు రెసిపీ వీడియో:
చేపల పులుసు తయారుచేయు విధానం:
ఆంధ్ర / తెలంగాణ స్టైల్ చేపల పులుసు రెసిపీ (Chepala Pulusu / Fish Curry Recipe)
Ingredients
- 1 kg చేప ముక్కలు
- 5 tbsp నూనె
- 2 ఉల్లిపాయలు మీడియం సైజు
- 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకున్నవి
- 2 కరివేపాకు రెబ్బలు
- ½ స్పూన్ పసుపు
- 1 tbsp ధనియాలు
- ½ స్పూన్ మెంతులు
- చింతపండు పెద్ద నిమ్మకాయ సైజు
- 3 tbsp కారం
- 1 tbsp ఉప్పు
- కొత్తిమీర కొద్దిగా
Instructions
- ముందుగా చేప ముక్కలను ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- తర్వాత కడాయిలో ఒక టేబుల్ స్పూన్, ధనియాలు వేసి రెండు నిమిషాలు వేయించి తర్వాత ఒక 1 స్పూన్ జీలకర్ర, అర టీ స్పూను మెంతులు బంగారు రంగు వచ్చేవరకు వేయించి చల్లార్చి పొడి చేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయిలో ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నుంచి మూడు నిమిషాల వరకు పండుగ అయ్యేంతవరకు వేయించుకోవాలి. తర్వాత రెండు నిలువుగా తరిగిన పచ్చిమిర్చి రెండు, మూడు రెబ్బల కరివేపాకు వేసి మగ్గించాలి.
- బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తరువాత అర టీ స్పూను పసుపు వేసి బాగా కలబెట్టుకోవాలి.
- ముందుగా నానబెట్టిన చింతపండును రసం తీసుకొని. మగ్గించిన ఉల్లిపాయ మిశ్రమంలో పోయండి. చింతపండు పులుపుకు తగ్గట్టుగా… ముక్క మునిగే వరకు మంచి నీళ్లు పోసి మూడు నిమిషాలు మూత పెట్టి మరిగించాలి.
- చింతపండు రసం మరిగిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల కారం, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, నూరి పెట్టిన మసాలాల పొడి కొద్దిగా అంటే సగం, అలాగే కొత్తిమీర వేసి అన్ని కలిసేలా గరిటతో కలపెట్టుకొని మూత పెట్టి మరిగించుకోవాలి.
- ఐదు నిమిషాల తర్వాత మూత తీసి బాగా మరుగుతున్న సమయంలో చేప ముక్కలను ఒక్కొక్కటిగా చక్కగా అమర్చుకొని మూడు నిమిషాలు ఎక్కువ మంట మీద ఉడికించి పది నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి.
- ఇప్పుడు ముక్క పట్టుకుని చూస్తే మెత్తగా ఉడికినట్లు ఉంటే మిగతా మసాలాలు పొడిని కూడా వేసి చివరగా కొత్తిమీర వేసి దించేయాలి.
- అంతే గుమగుమలాడే చాపల పులుసు రెడీ… ఇది చేసిన రోజు కన్నా… మరుసటి రోజు చాలా బాగుంటుంది అని అత్తమ్మ చెప్పింది. ఇది తాత ముత్తాతల కాలం నుంచిచెపుతున్న మాటే!
Video
Notes
మీరు ఈ రెసిపీని చదివినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఈ రెసిపీని తయారు చేసి, దాని రుచిని మరియు ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను.
ఇలాంటి మరిన్ని రెసిపీస్ తో పాటు వాటియొక్క విశేషతలు, చిట్కాలు, పోషకాల వివరాలు, మరియు వాటియొక్క ఆరోగ్యప్రయోజనాలను మీరు మీ WhatsApp ద్వారా పొందాలంటే ఇప్పుడే మా WhatsApp ఛానల్ ని Follow చెయ్యండి.