ముందుగా చేప ముక్కలను ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత కడాయిలో ఒక టేబుల్ స్పూన్, ధనియాలు వేసి రెండు నిమిషాలు వేయించి తర్వాత ఒక 1 స్పూన్ జీలకర్ర, అర టీ స్పూను మెంతులు బంగారు రంగు వచ్చేవరకు వేయించి చల్లార్చి పొడి చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయిలో ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నుంచి మూడు నిమిషాల వరకు పండుగ అయ్యేంతవరకు వేయించుకోవాలి. తర్వాత రెండు నిలువుగా తరిగిన పచ్చిమిర్చి రెండు, మూడు రెబ్బల కరివేపాకు వేసి మగ్గించాలి.
బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తరువాత అర టీ స్పూను పసుపు వేసి బాగా కలబెట్టుకోవాలి.
ముందుగా నానబెట్టిన చింతపండును రసం తీసుకొని. మగ్గించిన ఉల్లిపాయ మిశ్రమంలో పోయండి. చింతపండు పులుపుకు తగ్గట్టుగా... ముక్క మునిగే వరకు మంచి నీళ్లు పోసి మూడు నిమిషాలు మూత పెట్టి మరిగించాలి.
చింతపండు రసం మరిగిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల కారం, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, నూరి పెట్టిన మసాలాల పొడి కొద్దిగా అంటే సగం, అలాగే కొత్తిమీర వేసి అన్ని కలిసేలా గరిటతో కలపెట్టుకొని మూత పెట్టి మరిగించుకోవాలి.
ఐదు నిమిషాల తర్వాత మూత తీసి బాగా మరుగుతున్న సమయంలో చేప ముక్కలను ఒక్కొక్కటిగా చక్కగా అమర్చుకొని మూడు నిమిషాలు ఎక్కువ మంట మీద ఉడికించి పది నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి.
ఇప్పుడు ముక్క పట్టుకుని చూస్తే మెత్తగా ఉడికినట్లు ఉంటే మిగతా మసాలాలు పొడిని కూడా వేసి చివరగా కొత్తిమీర వేసి దించేయాలి.
అంతే గుమగుమలాడే చాపల పులుసు రెడీ... ఇది చేసిన రోజు కన్నా... మరుసటి రోజు చాలా బాగుంటుంది అని అత్తమ్మ చెప్పింది. ఇది తాత ముత్తాతల కాలం నుంచిచెపుతున్న మాటే!