Mokkajonna garelu / Corn vada recipe: మొక్క జొన్న చాలా మంది ఎంతో ఇష్టంగా తినే పదార్థం. మొక్క జొన్న చాలా చౌకగా లభించే ఆహారము. దీర్ఘకాలిక వ్యాధులను సైతం తగ్గించగల లూతేయిన్ అనే ఎమినో యాసిడ్ కలిగి ఉంటుంది.
ఇది మంచి యాంటీ ఆక్సిడెంటు గా పంచేస్తుంది. ఇందులో విటమిన్ ఇ, విటమిన్ బి 6 వంటివి పుష్కలం గా ఉంటాయి. ఈ మొక్క జొన్నలను సహజం గా వేడినీటిలో ఉడికించి లేదా నిప్పుల పై కాల్చి తింటుంటారు.
మొక్క జొన్న గింజల నుండి పాప్ కార్న్ తయారుచేస్తారు. లేత మొక్క జొన్న కంకుల ను బేబీ కార్న్ గా కూర గా వండి తింటుంటారు. మొక్క జొన్న పిండి తో రొట్టెలు కూడా చేస్తారు. ఇలా అనేక రకాలుగా మొక్క జొన్నను వినియోగిస్తుంటారు. ఇప్పుడు మరింత రుచికరం గా ఉండే మొక్క జొన్న గారెలు (Mokkajonna garelu / Corn vada recipe) చేసేద్దాం పదండి.
మొక్క జొన్న గారెలు రెసిపీ (Corn vada recipe) టిప్స్:
- మొక్క జొన్న మరి ముదురు గా ఉన్నది కాకుండా లేతది తీసుకుంటే గారెలు మెత్తగా చాలా రుచిగా వస్తాయి. ముదిరిన మొక్కజొన్న అయితే వేడి చల్లరితే గట్టిగా అయ్యి తినేప్పుడు నారసాగినట్టు సాగుతాయి. అంత బాగా ఉండదు.
- ఈ గారెలు(Mokkajonna garelu) స్వీట్ కార్న్ మొక్క జొన్నల తో కంటే నాటు మొక్క జొన్నల తో చేస్తే మరింత రుచి గా ఉంటాయి.
- పిండి పట్టేటప్పుడు మరి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకుంటేనే తినేప్పుడు మొక్క జొన్న రుచి నోటికి తగులుతుంది.
- గారెలు ఇంకా మృదువుగా రావాలి అంటే ఇందులో కాస్తంత బియ్యం పిండి గాని, శనగ పిండి గాని కలుపుకుంటే ఇంకా బాగా వస్తాయి.
- వేయించే టప్పుడు సన్నని మంటపై మాత్రమే వేయించుకోవాలి. అప్పుడే లోపలి దాకా బాగా వేగుతాయి. అదే పెద్ద మంట పైన అయితే బయట వేగి లోపల అంతా పచ్చిగానే ఉంటుంది.
క్రిస్పీ గా ఉండే టేస్టీ మొక్కజొన్న గారెలు / వడలు | Mokkajonna garelu | Corn vada recipe
Ingredients
- 1 కప్పు మొక్క జొన్న గింజలు
- 5 పచ్చి మిర్చి
- ½ కప్పు కొత్తిమీర
- అల్లం ముక్క చిన్నది
- 3 కరివేపాకు రెబ్బలు
- ½ కప్పు శనగ పప్పు
- 1 టీ స్పూన్ పసుపు
- 2 tbsp బియ్యం పిండి
- 1 tbsp కారం
- ఉప్పు రుచికి సరిపడా
- ½ కప్పు ఉల్లిపాయ తరుగు
- నూనె సరిపడా
Instructions
- ముందుగా అరకప్పు శనగ పప్పు ను తీసుకొని బాగా కడిగి కనీసం గంట పాటు నాన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మొక్క జొన్న కంకులను తీసుకొని గింజలన్నీ ఒలుచుకొని శుభ్రం చేసి మిక్సీ జార్లో మొక్క జొన్న గింజలు పచ్చి మిర్చి, చిన్న అల్లం ముక్క వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకొని, ఒక గిన్నె లో వేసి, ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
- ముందుగా నానపెట్టుకున్న శనగ పప్పును తీసుకొని నీటిని అంతా తీసేసి మిక్సీ పట్టుకున్న మొక్క జొన్న మిశ్రమం లో వేసి ఇందులోనే, ఉల్లిపాయ తరుగు, కొద్దిగా బియ్యం పిండి, కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా అన్నీ కలిసేలా కలుపుకొని అన్నింటికీ ఉప్పు పట్టేలా ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.ఇందులో ఉల్లిపాయ తరుగు, బియ్యం పిండి నచ్చని వారు వేసుకోక పోయిన పర్వలేదు. బియ్యం పిండి వేయడం వలన గారెలు చక్కగా పొంగుతాయి.
- ఇలా 5 నిమిషాలు నానిన ఈ మిశ్రమాన్ని ఒక సారి కలిపి, స్టౌ వెలిగించి ముకుడు పెట్టి డీప్ ఫ్రై కి సరి పడా నూనె పోసి బాగా వేడయ్యాక కొద్దికొద్దిగా పిండి తీసుకొని గారేలులాగా చేతి పైన ఒత్తుకొని, నూనెలో వేసి లేత బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. గారెలు చేతిపైన రాని వారు అరటాకు పై గాని కవర్ గాని చేసుకోవచ్చు. వేయించేటప్పుడు మాత్రం సన్నని మంట పైనే వేయించాలి. పెద్ద మంట పెడితే వేగుతాయి కానీ లోపల అలానే పచ్చిగా ఉంటాయి. లోపలి దాక వేగాలి అంటే సన్నని మంట పైననే చేసుకోవాలని గుర్తుంచుకోండి.
- ఇలా ఒకదాని తరువాత ఒకటి వేసుకుంటే సరి ఎంతో రుచిగా ఉండే మొక్క జొన్న గారెలు రెడీ.
Notes
మీరు ఈ రెసిపీని చదివినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఈ రెసిపీని తయారు చేసి, దాని రుచిని మరియు ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను.
ఇలాంటి మరిన్ని రెసిపీస్ తో పాటు వాటియొక్క విశేషతలు, చిట్కాలు, పోషకాల వివరాలు, మరియు వాటియొక్క ఆరోగ్యప్రయోజనాలను మీరు మీ WhatsApp ద్వారా పొందాలంటే ఇప్పుడే మా WhatsApp ఛానల్ ని Follow చెయ్యండి.