Veg Biryani | Vegetable Biryani | Vegetarian Biryani | Homemade Biryani Recipe:
వెజ్ బిర్యానీ… వినగానే మసాలా ఘాటు నశాలాన్ని తాకింది అనుకుంటా కదా… మరి బిర్యానీ అంటే ఆ మాత్రం వుండాలి. వీక్ ఎండ్ వస్తే బిర్యానితోనే చిల్ కదా… బిర్యానీ నచ్చని వారు బిర్యానిని మెచ్చని వారు నాకు తెలిసి ఎవ్వరూ ఉండరు.
నాన్ వెజ్ ప్రియుల కోసం అనేక రకాల బిర్యానిలు ఉన్నాయి. వెజ్ తినే వారికోసం కూడా ఉన్నాయి అనుకోండి. అందులో వెజిటేబుల్ బిర్యానిని (Vegetable Biryani) చాలా మంది వెజ్ తినేవారు ఇష్ట పడతారు. అనేక రకాల కూరగాయలను, మంచి ఘుమఘుమలాడే మసాలా దినుసులు వేసి బియ్యం తో తయారు చేసే వంటకం ఇది.
ఈ వెజ్ బిర్యానిని (Veg Biryani / Vegetarian Biryani) ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ లో చేస్తుంటారు బిర్యానీ అంటేనే పెద్ద పని. కూరగాయలు, మసాలాలు వేయించాలి బియ్యాన్ని సగం ఉడికించాలి. ఉడికించిన ఆ బియ్యాన్ని మరలా కూరగాయలు మసాలా మిశ్రమం లో కలపాలి అబ్బో ఇంకా ఎంతో ఉంటుంది. అలా ఏమి లేకుండా ఎంతో సులభంగా అచ్చం అదే రుచితో వచ్చేలా మరి మన స్టైల్ లో బిర్యానిని ఇప్పుడు చేసేద్దాం.
వెజిటేబుల్ బిర్యానీ టేస్ట్ ను రెట్టింపు చేసే కొన్ని చిట్కాలు
- సహజం గా బిర్యానికి బాస్మతి రైస్ అయితేనే బాగుంటాయి. కానీ బాస్మతి రైస్ దొరకకపోతే మామూలు రైస్ తో నైనా బిర్యానీ చేసుకోవచ్చు. బిర్యాని వండడానికి ఏ బియ్యాన్ని వాడినా గాని కనీసం ఒక గంట పాటు నానపెట్టుకోవాలి.
- బిర్యానిలో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట కొన్న దానికన్నా మనం ఇంట్లో అప్పటి కప్పుడు చేసుకున్నది అయితే మరింత రుచిగా ఉంటుంది.
- పెరుగు మాత్రం పుల్లగా లేకుండా అప్పటి కప్పుడు చేసిన ఫ్రెష్ గడ్డ పెరుగు వాడాలి. పుల్లటి పెరుగు వాడితే బిర్యానీ అంత రుచి ఉండదు అని గుర్తుంచుకోండి.
- బిర్యానీలో మీకు దొరికిన ఏవైన కూరగాయలు వేసుకోవచ్చు. కచ్చితంగా ఇవే వేయాలన్న నియమం ఏమి లేదు.
- టమాటా ముక్కలు మచ్చిన వారు వేసుకోవచ్చు లేదంటే లేదు.
- బిర్యానిని వండుతున్న సమయం లో ఎక్కువగా కలుపకూడదు. ఊరికే కలిపితే బియ్యం విరిగిపోయి చివరికి బిర్యానీ అంత బాగుండదు.
- ఇందులో ఎసరులో వేడి నీరు మాత్రమే పోసుకోవాలి. వేడి నీరు పోయడం వలన మెతుకులు పొడిపొడిగా ఉంటాయి. చల్లనీళ్ళు పోస్తే వేగిన మసాలా ల పరిమళం బయటకి వచ్చి ఫ్లేవరంత పోతుంది. అదే కలునడ చల్ల నీళ్ళ కారణం గా బియ్యం ఎక్కువ సేపు ఉడికి మెత్తబడి ముద్దలా తయారవుతుంది.
నోరూరించే వెజ్ / వెజిటేబుల్ బిర్యానీ తయారీ వీడియో:
వెజ్ బిర్యానీ | నోరూరించే వెజిటేబుల్ బిర్యానీ | Veg Biryani | Vegetable Biryani
Ingredients
- 2 అనాస పువ్వులు
- ½ టీ స్పూన్ మిరియాలు
- 8 లవంగాలు
- 2 చిన్నవి దాల్చిన చెక్క
- 6 యాలకులు
- 1 మారటి మొగ్గ
- 3 బిర్యానీ ఆకులు
- ½ కప్పు నూనె
- 50 g జీడిపప్పు
- ఉల్లిపాయ ముక్కలు
- 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి
- 3 పచ్చిమిర్చి
- 1 కప్పు బీన్స్
- 1 కప్పు క్యారెట్ ముక్కలు
- 1 కప్పు బంగాళా దుంప ముక్కలు
- 1 కప్పు కాలి ఫ్లవర్ ముక్కలు
- 1 కప్పు పచ్చి బటానీ
- ½ కప్పు టమాటా ముక్కలు
- 2 టీ స్పూన్స్ టీ స్పూన్స్
- 1½ కప్పులు బాస్మతి బియ్యం
- ½ కప్పు పుదీనా
- ½ కప్పు కొత్తిమీర
- ½ కప్పు పెరుగు
- 2 టీ స్పూన్స్ నిమ్మరసం
- 1 టీ స్పూన్ పసుపు
- 1 టేబుల్ స్పూన్ కారం
- సరిపడా ఉప్పు
Instructions
- ముందుగా బాస్మతి బియ్యాన్ని నాలుగు ఐదు సార్లు బాగా కడిని ఒక గంట సేపు నానపెట్టుకోవడానికి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ వెలిగించి తగినంత నూనె పోసి నూనె వేడయ్యాక అందులో మారటి మొగ్గ, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, యాలకులు వంటి మసాలా దినుసులు మరియు జీడిపప్పు వేసి మాడకుండా వేయించాలి. బిర్యానికి వచ్చే రుచి అంతా ఈ మసాలా లోనే ఉంటుంది. మాడితే రుచి పోతుంది కాబట్టి మాడకుండా దోరగా వేయించాలి. ఇక్కడ నూనె కాకుండా నచ్చిన వారు నెయ్యి కూడా వాడుకోవచ్చు.
- మసాలా దినుసులు బాగా వేగుతున్న సమయం లో పచ్చి మిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కాస్తంత ఉప్పు వేసి ఉల్లిపాయలు లేత బంగారు రంగు వచ్చేంత వరకు దోరగా వేయించాలి. ఇప్పుడే ఉప్పు వేయడం వలన ఉల్లిపాయలు త్వరగా నూనెలో మగ్గుతాయి.
- ఇందులో, ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న అన్నీ కూరగాయ ముక్కలు, పచ్చి బఠానీ లు వేసి మూతపెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. పూర్తిగా కాకుండా సగం వూడికెంత వరకు ఉంచి మూత తీసి బాగా కలుపుకోవాలి.
- సగం వరకు ఉడికిన కూరగాయల మిశ్రమం లో కొద్దిగా పసుపు, ఒక అరకప్పు పెరుగు వేసి, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా కారం వేసి మూతపెట్టి పెరుగు పూర్తిగా కురల్లో కలిసిపోయేంత వరకు ఉడికించుకోవాలి.
- ఇప్పుడు టమాటా ముక్కలు, సరిపడా వేడి నీళ్ళు పోసి మంట పెద్దగా పెట్టి నీళ్ళు మరగనివ్వాలి.
- బాగా ఎసరు మరుగుతున్న సమయం లో ముందుగా ఒక గంట సేపు నాన పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని తీసుకొని నీళ్ళన్నీ తీసేసి కేవలం బియ్యాన్ని మాత్రమే మరుగుతున్న ఎసరులో వేసి బాగా కలిపి మూతపెట్టి కలిపి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
- నీళ్ళన్నీ ఇంకిపోయి దగ్గర పడుతున్న సమయం లో మూతతీసి మెతుకు చీదరకుండా జాగ్రత్తగా ఒకసారి పూర్తిగా కలుపుకొని కొత్తిమీర, పుదీనా చల్లుకొని మూతపెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించి దించుకోవడమే… అంతే ఎంతో సులభం గా ఉండే వెజ్ బిర్యానీ రెడీ.
Video
Notes
మీరు ఈ రెసిపీని చదివినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఈ రెసిపీని తయారు చేసి, దాని రుచిని మరియు ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను.
ఇలాంటి మరిన్ని రెసిపీస్ తో పాటు వాటియొక్క విశేషతలు, చిట్కాలు, పోషకాల వివరాలు, మరియు వాటియొక్క ఆరోగ్యప్రయోజనాలను మీరు మీ WhatsApp ద్వారా పొందాలంటే ఇప్పుడే మా WhatsApp ఛానల్ ని Follow చెయ్యండి.
3 thoughts on “నోరూరించే వెజిటేబుల్ బిర్యానీ | వెజ్ బిర్యానీ | Veg Biryani | Vegetable Biryani”
Saved ass a favorite, I love your web site!
Today, I went to the beach with my kids. I found a sea shell and gave it tto my 4 year
old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She placed
the shell to her ear and screamed. There was a hermit crb inside and itt
pinched her ear. She never wants tto go back! LoL I know this is completely off topic but I had to tell someone!
Hello, Neat post. There iss a problem with your site in internet explorer, would check this?
IE nonetheless is the marketplace leader and a biig section of
other people will omit your fantastic writing because of this problem.