Go Back
Veg Biryani | Vegetable Biryani | Vegetarian Biryani | Homemade Biryani Recipe

వెజ్ బిర్యానీ | నోరూరించే వెజిటేబుల్ బిర్యానీ | Veg Biryani | Vegetable Biryani

2.34 from 3 votes
Prep Time 15 minutes
Cook Time 30 minutes
Total Time 45 minutes
Course Main Course
Cuisine Andhra, Hyderabadi, Indian, south indian, telugu
Servings 5

Ingredients
  
  • 2 అనాస పువ్వులు
  • ½ టీ స్పూన్ మిరియాలు
  • 8 లవంగాలు
  • 2 చిన్నవి దాల్చిన చెక్క
  • 6 యాలకులు
  • 1 మారటి మొగ్గ
  • 3 బిర్యానీ ఆకులు
  • ½ కప్పు నూనె
  • 50 g జీడిపప్పు
  • ఉల్లిపాయ ముక్కలు
  • 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి
  • 3 పచ్చిమిర్చి
  • 1 కప్పు బీన్స్
  • 1 కప్పు క్యారెట్ ముక్కలు
  • 1 కప్పు బంగాళా దుంప ముక్కలు
  • 1 కప్పు కాలి ఫ్లవర్ ముక్కలు
  • 1 కప్పు పచ్చి బటానీ
  • ½ కప్పు టమాటా ముక్కలు
  • 2 టీ స్పూన్స్ టీ స్పూన్స్
  • కప్పులు బాస్మతి బియ్యం
  • ½ కప్పు పుదీనా
  • ½ కప్పు కొత్తిమీర
  • ½ కప్పు పెరుగు
  • 2 టీ స్పూన్స్ నిమ్మరసం
  • 1 టీ స్పూన్ పసుపు
  • 1 టేబుల్ స్పూన్ కారం
  • సరిపడా ఉప్పు

Instructions
 
  • ముందుగా బాస్మతి బియ్యాన్ని నాలుగు ఐదు సార్లు బాగా కడిని ఒక గంట సేపు నానపెట్టుకోవడానికి పక్కన పెట్టుకోవాలి.
    Veg Biryani | Vegetable Biryani | Vegetarian Biryani | Homemade Biryani Recipe
  • ఇప్పుడు స్టౌ వెలిగించి తగినంత నూనె పోసి నూనె వేడయ్యాక అందులో మారటి మొగ్గ, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, యాలకులు వంటి మసాలా దినుసులు మరియు జీడిపప్పు వేసి మాడకుండా వేయించాలి.
    బిర్యానికి వచ్చే రుచి అంతా ఈ మసాలా లోనే ఉంటుంది. మాడితే రుచి పోతుంది కాబట్టి మాడకుండా దోరగా వేయించాలి. ఇక్కడ నూనె కాకుండా నచ్చిన వారు నెయ్యి కూడా వాడుకోవచ్చు.
    Veg Biryani | Vegetable Biryani | Vegetarian Biryani | Homemade Biryani Recipe
  • మసాలా దినుసులు బాగా వేగుతున్న సమయం లో పచ్చి మిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కాస్తంత ఉప్పు వేసి ఉల్లిపాయలు లేత బంగారు రంగు వచ్చేంత వరకు దోరగా వేయించాలి.
    ఇప్పుడే ఉప్పు వేయడం వలన ఉల్లిపాయలు త్వరగా నూనెలో మగ్గుతాయి.
    Veg Biryani | Vegetable Biryani | Vegetarian Biryani | Homemade Biryani Recipe
  • ఇందులో, ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న అన్నీ కూరగాయ ముక్కలు, పచ్చి బఠానీ లు వేసి మూతపెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
    పూర్తిగా కాకుండా సగం వూడికెంత వరకు ఉంచి మూత తీసి బాగా కలుపుకోవాలి.
    Veg Biryani | Vegetable Biryani | Vegetarian Biryani | Homemade Biryani Recipe
  • సగం వరకు ఉడికిన కూరగాయల మిశ్రమం లో కొద్దిగా పసుపు, ఒక అరకప్పు పెరుగు వేసి, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా కారం వేసి మూతపెట్టి పెరుగు పూర్తిగా కురల్లో కలిసిపోయేంత వరకు ఉడికించుకోవాలి.
    Veg Biryani | Vegetable Biryani | Vegetarian Biryani | Homemade Biryani Recipe
  • ఇప్పుడు టమాటా ముక్కలు, సరిపడా వేడి నీళ్ళు పోసి మంట పెద్దగా పెట్టి నీళ్ళు మరగనివ్వాలి.
    Veg Biryani | Vegetable Biryani | Vegetarian Biryani | Homemade Biryani Recipe
  • బాగా ఎసరు మరుగుతున్న సమయం లో ముందుగా ఒక గంట సేపు నాన పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని తీసుకొని నీళ్ళన్నీ తీసేసి కేవలం బియ్యాన్ని మాత్రమే మరుగుతున్న ఎసరులో వేసి బాగా కలిపి మూతపెట్టి కలిపి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
    Veg Biryani | Vegetable Biryani | Vegetarian Biryani | Homemade Biryani Recipe
  • నీళ్ళన్నీ ఇంకిపోయి దగ్గర పడుతున్న సమయం లో మూతతీసి మెతుకు చీదరకుండా జాగ్రత్తగా ఒకసారి పూర్తిగా కలుపుకొని కొత్తిమీర, పుదీనా చల్లుకొని మూతపెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించి దించుకోవడమే... అంతే ఎంతో సులభం గా ఉండే వెజ్ బిర్యానీ రెడీ.
    Veg Biryani | Vegetable Biryani | Vegetarian Biryani | Homemade Biryani Recipe

Video

Notes

నచ్చిందా... అయితే మరిన్ని మంచి రుచులకోసం మా చెఫ్ సరు వెబ్ సైట్ ని వీక్షిస్తుండండి. మీ సలహాలు సూచనలను కమెంట్ రూపం లో మాకు తెలియజేయండి.
Keyword Biryani, Hyderabadi Biryani, Kuragayala Biryani, Veg Biryani, Vegetable Biryani, Vegetarian biryani