Sorakaya dosa / Bottle gourd dosa / Anapakaya dosa / Lauki dosa recipe:
సొరకాయ దోస (Bottle gourd dosa / Lauki dosa) అని వినగానే మిలొ చాలా మందికి ఆశ్చర్యం కలుగొచ్చు… కలిగే ఉంటుంది లెండి.
పేరే కొత్తగా ఉంది కదా మరి సొరకాయ తో కూర వండడం, సొరకాయ ముక్కలతో సాంబార్ చేయడం చూస్తుంటాం. కానీ సొరకాయ తో కొత్తగా దోసలు కూడా వేయవచ్చు.
రోజు చాలా ఇళ్ళల్లో దోసలు తిని విసుగు పుట్టే ఉంటుంది. కానీ అదే దోసను కొత్తగా, కొత్త రుచి తో చేస్తే తిన్నవారు ఆహా అనాల్సిందే అలాంటి మంచి రుచి కలిగిన దోసనే ఈ సొరకాయ దోస (Sorakaya dosa / Anapakaya dosa) ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం పదండి.
ఇన్స్టెంట్ గా చేసుకోగలిగే సొరకాయ దోస రెసిపీ తయారీ విధానం (Sorakaya Dosa | Anapakaya Dosa | Bottle Gourd Dosa | Lauki dosa)
Ingredients
- 1 cup బియ్యం
- లేత సొరకాయ ముక్కలు పెద్ద సైజు కప్పు
- 2 tbps జీలకర్ర
- సన్నగా తరిగిన అల్లం ముక్కలు చిన్న సైజు కప్పు
- 1 cup కొత్తిమీర తరుగు
- 1 cup సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు
- 1/2 tbps ఇంగువ
- ఉప్పు రుచికి సరిపడా
- నూనె తగినంత
Instructions
- ముందుగా బియ్యాన్ని తీసుకొని ఒక గంట ముందు గా నానపెట్టుకోవాలి. బాగా నానిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి అందులోనే పొట్టు తీసి చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న లేత సొరకాయ ముక్కలను రెండు రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా దోస పిండికి అవసరమయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి.
- దోస పిండికి మామూలు సన్న బియ్యం కన్నా దొడ్డు బియ్యం అదే మనం రేషన్ బియ్యం అంటాం కదా ఈ బియ్యాన్ని కనక వాడితే దోస పిండి ఇంకా బాగా వస్తుంది. రేషన్ బియ్యం దొరకని వాళ్ళు సన్న బియ్యం తో చేసుకున్న పరవాలేదు.
- మెత్తగా పట్టి పెట్టుకున్న ఈ పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు ,జీలకర్ర, ఇంగువ వేసి బాగా కలిపి 10 నిమిషాలు అలానే పక్కన పెట్టుకోవాలి.
- 10 నిమిషాల తరవాత ఒక సారి మళ్ళీ బాగా కలిపి స్టౌ పైన దోస ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె తీసుకొని ప్యాన్ అంతా అప్లయ్ చేసుకొని కలిపి పెట్టుకున్న దోశపిండి ని గుంట గరిట తో తీసుకొని దోశలా పోసుకోవాలి. ఈ దోస మామూలు దోశలా అంతా సన్నగా గుండ్రం గా రాదు. అయిన పరవాలేదు కొద్దిగా జాగ్రత్తగా వేసుకుంటే మరి గుండ్రం గా కాదు కానీ కొద్దిగా గుండ్రం గానే వస్తాయి.
- ప్యాన్ పై వేసుకున్న దోసకు అంతా నూనెను అప్లయ్ చేసుకోవాలి ఈ దోస కాస్త లావుగా వస్తుంది కనుక దోస ను రెండు వైపుల జాగ్రత్తగా చిన్న మంట పై మాడకుండా దోరగా కాల్చుకోవాలి.
- అంతే ఎంతో రుచిగా ఉండే కొత్తరకపు సొరకాయ దోస (orakaya dosa) రెడీ. ఈ దోస వేసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా వోపిగ్గా వేసుకోవాలి అని మాత్రం మరచిపోకండి.
Video
Notes
మీరు ఈ రెసిపీని చదివినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఈ రెసిపీని తయారు చేసి, దాని రుచిని మరియు ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను.
ఇలాంటి మరిన్ని రెసిపీస్ తో పాటు వాటియొక్క విశేషతలు, చిట్కాలు, పోషకాల వివరాలు, మరియు వాటియొక్క ఆరోగ్యప్రయోజనాలను మీరు మీ WhatsApp ద్వారా పొందాలంటే ఇప్పుడే మా WhatsApp ఛానల్ ని Follow చెయ్యండి.