Ragi dosa recipe / Finger millet dosa recipe: రాగులు [తైదలు ] ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆంగ్లం లో వీటిని ‘ఫింగర్ మిల్లెట్స్’ అని అంటారు. ఇది భారత దేశం లో పండే అత్యంత పురాతనమైన తృణధాన్య పంట.
రాగుల్లో అత్యంత ఎక్కవగా ఖనిజ లవణాలు మరియు పొటాషియం ఉంటాయి. అలాగే అధిక మొత్తం లో కాల్షియం ఉంటుంది.
ముఖ్యం గా రాగులతో రాయల సీమ ప్రాంతంలో రాగి సంకటి చేసుకొని తింటారు. ఇంకొన్ని ప్రాంతాల్లో రాగి రొట్టెలు చేసుకొని తింటారు. అదే రాగులతో ఇప్పుడు మనం ఎంతో రుచికరమైన దోశలను చేద్దాం.
రాగి దోశ రెసిపీ (Ragi dosa recipe / Finger millet dosa) టిప్స్ / చిట్కాలు:
- రాగి దోసకు(Ragi dosa recipe / Finger millet dosa recipe) రాగులను కనీసంగా నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానపెట్టుకోవాలి. అలా చేస్తే పిండి మరింత మృదువుగా వస్తుంది.
- బియ్యం మాములువి కాకుండా దొడ్డు బియ్యం అదే రేషన్ బియ్యం వాడితే రోశ మరింత రుచి గా వస్తుంది.
- మినప పప్పు కూడా వేయడం వల్ల పిండి జిగురుగా వచ్చి దోశ వేసినప్పుడు విరగకుండ వస్తుంది.
- పిండి పట్టుకునేటప్పుడు ఎక్కువ గా నీళ్ళు పోయవద్దు. పిండి ఎప్పుడు కూడా చిక్కటి మజ్జిక లాగా ఉండాలి.
- పెనం మందంగా ఉన్నటువంటి దాని పైన వేస్తే దోసలు బహు చక్కగా వస్తాయి.
ఇన్స్టెంట్ గా చేసుకోగలిగే హెల్తీ రాగి దోశ రెసిపీ | Ragi Dosa Recipe | Finger Millet Dosa Recipe
Ingredients
- 1 కప్పు రాగులు
- ½ కప్పు బియ్యం
- ¼ కప్పు మినప పప్పు
- నూనె తగినంత
- ఉప్పు రుచికి సరిపడా
- వంట సోడా చిటికెడు
Instructions
- ముందుగా రాగులను, బియ్యాన్ని, మినపపప్పును నీటితో ఒక నాలుగు ఐదు సార్లు బాగా కడిగి మరలా నీళ్ళు పోసి నానపెట్టుకోవడానికి పక్కన పెట్టుకోవాలి.వీటిని కనీసంగా ఐదు గంటల పాటు నాన పెట్టుకోవాలి. అప్పుడే రాగులు బాగా నానుతాయి.
- ఇవి బాగా నానిన తరువాత నీళ్ళని తీసేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పిండి పట్టుకోవాలి.పిండి చిక్కటి మజ్జికలా ఉండాలని గుర్తుపెట్టుకొండి. అప్పుడే దోస మంచి మందంగా వస్తుంది.
- పిండి ని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి సరిపడ ఉప్పు, ఒక చిటికెడు వంట సోడా వేసి మొత్తం పిండిని ఒక 10 నిమిషాల పాటు పిండి పైకి పొంగేలా గిల కొట్టుకోవాలి. ఇలా గిల కొట్టడం వల్ల పిండి లోకి గాలి చేరి దోసలు వేసినప్పుడు పొంగుతూ చాలా బాగా వస్తాయి.
- ఇప్పుడు బాగా గిల కొట్టిన పిండిని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. సమయం ఉన్నవారు ఒక రాత్రి అంతా పిండిని అలానే పెడుతె పిండి బాగా పులుస్తుంది. దోసలు ఇంకా బాగా వస్తాయి. లేదు అనుకున్నవారు అప్పుడే వేసుకున్న బాగానే ఉంటాయి.
- స్టౌ పై దోస పెనం పెట్టి పెనం వేడయ్యాక పిండిని తీసుకొని బాగా కలిపి పెనం కి నూనె పట్టించి గరిట తో పిండి వేసి మామూలు దోస వేసుకున్నట్టే తిప్పుకొని మంచి రంగు వచ్చేలా కాల్చుకుంటే సరి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి దోస రెడీ.
Video
Notes
మీరు ఈ రెసిపీని చదివినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఈ రెసిపీని తయారు చేసి, దాని రుచిని మరియు ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను.
ఇలాంటి మరిన్ని రెసిపీస్ తో పాటు వాటియొక్క విశేషతలు, చిట్కాలు, పోషకాల వివరాలు, మరియు వాటియొక్క ఆరోగ్యప్రయోజనాలను మీరు మీ WhatsApp ద్వారా పొందాలంటే ఇప్పుడే మా WhatsApp ఛానల్ ని Follow చెయ్యండి.
5 thoughts on “ఇన్స్టెంట్ గా చేసుకోగలిగే రాగి దోశ రెసిపీ | Ragi Dosa Recipe | Finger Millet Dosa Recipe”
An intriguing discussion is defiinitely worth comment. I think that you should publish more
about this topic, it may not be a taboo matter but typically folks don’t speak
about such subjects. To thhe next! Kind regards!!
Hello, i think that i saw you visited my weblog so
i came to return thhe favor.I am attempting to find things to enhance my web site!I suppose its ok to use a few of your ideas!!
wee
ss
CAPTCHAs can be photos, numbers, chars, or a mix of all that you
are called for to fix to continue better.