Egg Pickle / Egg Pachadi Recipe: ఎగ్ పచ్చడి… వినగానే ఎగ్ పచ్చడా అదెలా ఉంటుంది? అసలు ఎగ్ పచ్చడా ఉంటుందా? అని అనుకుంటున్నారా! కచ్చితం ఉంటుంది. ఇప్పటి వరకు నాన్ వెజ్ చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, ఫిష్ పచ్చడి తినే ఉంటారు. ఎగ్ ను ఉడికించి, ఆమ్లెట్ రూపం లో కానీ ఫ్రై రూపం లో చేసుకొని తింటుంటారు. కానీ ఇప్పుడు కొత్తగా ఎగ్ తో పచ్చడి చేద్దాం (Kodi guddu pachadi recipe / Egg pachadi).
ఎగ్ పచ్చడి(Egg Pickle / Egg Pachadi): రెసిపీ టిప్స్!
- గుడ్లను ఉడికించుకునేటప్పుడు లోపల మొత్తం బాగా ఉడికేల చూసుకోవాలి. లేదంటే పచ్చడి త్వరగా పాడవుతుంది.
- గుడ్లు ఉడికించే నీటిలో కొద్దిగా ఉప్పు వేసి ఉడికిస్తే చాలా బాగా ఉడుకుతాయి .
- కారం మాత్రం వీలైనంత వరకు పట్టిచ్చిన కారం వాడుకుంటే కొద్దిగా కారం వేసుకున్న పచ్చడి కి కారం బాగా పడుతుంది .
- ఎగ్ ను డి ఫ్రై చేసేటప్పుడు ముక్కంతా బాగా నూనెలో వేగి పచ్చిదనం పొయ్యేలా జాగ్రత్తగా వేయించుకోవాలి. లేదంటే పచ్చడి త్వరగా పడవుతుంది.
- పచ్చడిని(kodi guddu pachadi) ప్లాస్టిక్ దబ్బాల్లో కంటే గాజు జాడిలో నిల్వ ఉంచితే బాగా రుచి వస్తుంది.
ఎగ్ పచ్చడి | కోడిగుడ్డు పచ్చడి రెసిపీ
అన్నంలోకి పుల్ల పుల్లగా నోటికి రుచిగా ఉండే కోడిగుడ్డు పచ్చడి ని ఎప్పుడైనా తిన్నారా? సింపుల్ గా తయారు చేసుకోగలిగే & నోటికి ఎంతో రుచిగా ఉండి, లొట్టలేయించే ఈ రెసిపీ ని ఇప్పుడే ట్రై చెయ్యండి.
Prep Time 15 minutes mins
Cook Time 20 minutes mins
Total Time 35 minutes mins
Course Main Course
Cuisine Andhra, Indian, south indian, Telangana
Servings 10
Ingredients
- 5 ఉడకపెట్టిన గుడ్లు
- 3 tbsp కారం
- 3 టీ స్పూన్స్ ధనియాలు
- 2 టీ స్పూన్స్ జీలకర్ర
- 5 ఇలాచి
- దాల్చిన చెక్క చిన్నది
- 1 టీ స్పూన్ లవంగాలు
- 1 టీ స్పూన్ మెంతులు
- 1 టీ స్పూన్ మిరియాలు
- 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
- నూనె సరిపడా
- ½ కప్పు నిమ్మరసం
- 1 టీ స్పూన్ పసుపు
Instructions
- ముందుగా మంచి రకం గుడ్లను తీసుకొని నీటిలో కొద్దిగా ఉప్పువేసి బాగా ఉడికించికోవాలి. ఉడికిన గుడ్లలో చల్లనీరు పోసి పైన ఉన్న పెంకు తీసేసి గుడ్డు లోపల ఉండే పసుపు రంగు గుడ్డు, అదే నీలం అంటాము కదా అది తీసేసి మరీ చిన్నగా కాకుండా ఒక ఇంచు సైజు లో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ పై ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రై కి సరిపడ నూనె పోసి ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న గుడ్డు ముక్కలను వేసి ముక్కలోని పచ్చిదనం అంతా పోయి మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- మళ్ళీ స్టౌ పై ప్యాన్ పెట్టుకొని అందులో ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు ఒక దాని తరవాత ఒకటి వేసి మాడకుండా దోరగా వేయించి మిక్సీ లో వేసి మెత్తటి పొడిలా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
- కలుపు కోవడానికి అనువుగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్డు ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల కారం, సరిపడా ఉప్పు, మిక్సీలో పొడి చేసిపెట్టుకున్న మసాలా మిశ్రమం అంతా వేసి ముక్కలు బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ కారం ఎవరి రుచికి తగినట్టుగా వారు వేసుకోవచ్చు. ఇంతే వేయాలన్న నియమం ఏమి లేదు . కొందరు కారసం ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు. కాబట్టి వారు తినెదానిని బట్టి వేసుకుంటే మంచిది.
- ఇప్పుడు మళ్ళీ స్టౌ పై ప్యాన్ పెట్టి అందులో పచ్చడి కలుపుకోవడానికి సరిపోయేంత నూనె పోసి, అది వేడయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయేవరకు వేయించి ఇందులోనే ఒక టీ స్పూన్ పసుపు వేసి, ఇందాక కారం మసాలా మిశ్రమం కలిపి పెట్టుకున్న గుడ్డు ముక్కల్లో పోసి బాగా ముక్క నూనెతో కలిసేలా కలపాలి.ఇందులో ఇష్టం ఉన్నవారుఅల్లం వెల్లుల్లి పేస్ట్ కు బదులు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసకోవచ్చు.
- నూనె అంతా బాగా కలిశాక అందులోనే అరకప్పు నిమ్మరసం పోసి బాగా కలుపుకొని జాడిలో పెట్టుకుంటే సరి ఎంతో కొత్తగా సులభంగా ఉండే గుడ్డు పచ్చడి రెడీ.ఇందులో నిమ్మరసం పోయడం వలన ముక్క బాగా ఊరుతుంది. పైగా నిమ్మ రసం వలన పచ్చడికి మంచి రుచి వస్తుంది.
Video
Notes
ఇదండీ చసారు కదా… ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మా చెఫ్ సరు వెబ్ సైట్ ని వీక్షిస్తూండండి. మీ సలహాలను, సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Keyword andhra egg pickle, egg pachadi, egg pickle, guddu pachadi, guddu pickle, kodi guddu pachadi, non veg pachadi, non veg pickle
మీరు ఈ రెసిపీని చదివినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఈ రెసిపీని తయారు చేసి, దాని రుచిని మరియు ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను.
ఇలాంటి మరిన్ని రెసిపీస్ తో పాటు వాటియొక్క విశేషతలు, చిట్కాలు, పోషకాల వివరాలు, మరియు వాటియొక్క ఆరోగ్యప్రయోజనాలను మీరు మీ WhatsApp ద్వారా పొందాలంటే ఇప్పుడే మా WhatsApp ఛానల్ ని Follow చెయ్యండి.