ముందుగా రాగులను, బియ్యాన్ని, మినపపప్పును నీటితో ఒక నాలుగు ఐదు సార్లు బాగా కడిగి మరలా నీళ్ళు పోసి నానపెట్టుకోవడానికి పక్కన పెట్టుకోవాలి.వీటిని కనీసంగా ఐదు గంటల పాటు నాన పెట్టుకోవాలి. అప్పుడే రాగులు బాగా నానుతాయి.
ఇవి బాగా నానిన తరువాత నీళ్ళని తీసేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పిండి పట్టుకోవాలి.పిండి చిక్కటి మజ్జికలా ఉండాలని గుర్తుపెట్టుకొండి. అప్పుడే దోస మంచి మందంగా వస్తుంది.
పిండి ని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి సరిపడ ఉప్పు, ఒక చిటికెడు వంట సోడా వేసి మొత్తం పిండిని ఒక 10 నిమిషాల పాటు పిండి పైకి పొంగేలా గిల కొట్టుకోవాలి. ఇలా గిల కొట్టడం వల్ల పిండి లోకి గాలి చేరి దోసలు వేసినప్పుడు పొంగుతూ చాలా బాగా వస్తాయి.
ఇప్పుడు బాగా గిల కొట్టిన పిండిని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. సమయం ఉన్నవారు ఒక రాత్రి అంతా పిండిని అలానే పెడుతె పిండి బాగా పులుస్తుంది. దోసలు ఇంకా బాగా వస్తాయి. లేదు అనుకున్నవారు అప్పుడే వేసుకున్న బాగానే ఉంటాయి.
స్టౌ పై దోస పెనం పెట్టి పెనం వేడయ్యాక పిండిని తీసుకొని బాగా కలిపి పెనం కి నూనె పట్టించి గరిట తో పిండి వేసి మామూలు దోస వేసుకున్నట్టే తిప్పుకొని మంచి రంగు వచ్చేలా కాల్చుకుంటే సరి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి దోస రెడీ.
Video
Notes
ఈ దోస ను కూడా మామూలు దోస లాగా ఉల్లి పాయలు వేసి ఉల్లి పాయ దోసగాను, ఆలుగడ్డ మిశ్రమం పెట్టి మసాలా దోసగాను చేసుకోవచ్చు.చూశారు కదా... ఇలాంటి మరిన్ని మంచి రుచులకోసం మా చెఫ్ సరు వెబ్ సైట్ ని వీక్షిస్తూండండి.