Go Back
how to make palak paneer recipe

పాలక్ పన్నీర్ | రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ తయారీ విధానం

పన్నీర్ శాకహారం లో రారాజు... పన్నీర్ ను ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు అంటే నమ్మడం ఆశ్చర్యం లేదు . పన్నీర్ తో అనేక రకాల పదార్థాలు చేస్తుంటారు . వాటిల్లో ఒకటి పాలక్ పన్నీర్ ఎంతో రుచి కరమైన ఈ వంటకం రోటీ ,బట్టర్ నాన్ లోకి అయితే రుచిని వర్ణించడానికి కొత్త పదాలు పుట్టించాలి అనిపిస్తుంది . అంత బాగుంటుంది మరి అచ్చం రెస్టారెంట్ స్టైల్ లో ఉండే పాలక్ పన్నీర్ చేసేద్దాం పదండి ..
5 from 1 vote
Prep Time 20 minutes
Cook Time 30 minutes
Total Time 50 minutes
Course Curry, lunch, Main Course, Veg Curry
Cuisine Andhra, Andhra Pradesh, Hyderabad, Indian, Telangana
Servings 5

Ingredients
  

  • 1 cup పన్నీర్ ముక్కలు
  • 2 cups పాలకూర
  • 10 పచ్చిమిర్చి
  • ఉప్పు సరిపడా
  • 2 tbps చక్కర
  • 4 ఎండు మిర్చి
  • కరివేపాకు 3రెమ్మలు
  • 2 tbps జీలకర్ర
  • 2 tbps ఆవాలు
  • 1/4 tbps పసుపు
  • 1/2 cup నెయ్యి
  • 2 ఉల్లిపాయలు పెద్దవి
  • 2 వెల్లుల్లి పాయలు
  • 1/4 cup జీడిపప్పు
  • 2 tbps కారం
  • 2 tbps ధనియాల పొడి
  • 2 tbps కసూరి మేతి
  • 2 tbps నూనె

Instructions
 

  • ముందుగా స్టౌ పై గిన్నెలో నీళ్ళు పెట్టి ఆ నీళ్ళు మరుగుతున్న సమయం లో అందులో తరిగిన పాలకూర, 5 పచ్చిమిర్చి, 2 టీ స్పూన్ల ఉప్పు, ఒక టీ స్పూన్ వంట సోడా, ఒక టీ స్పూన్ చక్కర వేసి పాలకూర పూర్తిగా మెత్త పడేంత వరకు ఉంచి దించుకొని వేడి నీళ్లు అన్నీ తీసేసి ఉడికించిన పాలకూర చల్లటి నీళ్ళలో వేసి పాలకూర మొత్తం చల్ల బడెంత వరకు ఉంచాలి.
    how to make palak paneer recipe
  • సహజం గా ఉడికించిన పాలకూర కొద్దిసేపటి తరవాత కొద్దిగా రంగు మారుతుంటుంది. దానివల్ల పాలక్ పన్నీర్ వండిన తర్వాత ఆకుపచ్చ రంగులో ఉండదు. కానీ ఇలా చల్ల నీటిలో పెట్టడం వలన పాలకూర ఎంత సేపు అయిన ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది.
    how to make palak paneer recipe
  • ఇప్పుడు ఇలా ఉడికించుకున్న పాలకూర మిశ్రమాన్ని, జీడిపప్పు మిక్సీ లో వేసి మెత్తటి పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
    how to make palak paneer recipe in telugu
  • స్టౌ పై ప్యాన్ పెట్టి వేడయ్యాక అందులో రెండు టీ స్పూన్ల నూనె పోసి అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి కసూరి మెతి వేయాలి.
  • వేసి కాస్త వేగనివ్వాలి. ఇందులోనే వెల్లుల్లి పాయలను వోలుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని లేత బంగారు రంగు లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగాక ఉల్లిపాయాలను చాలా సన్నగా తరిగి వేసుకొని ఇవికూడా లేత బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక ఇందులో కాస్త పసుపు ముందుగా పేస్ట్ చేసిపెట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని వేసి కొన్ని నీళ్ళు పోసి పసరు వాసన పొయ్యే వరకు ఉడికించుకొని ఇందులో పన్నీర్ ముక్కలను, కొద్దిగా నెయ్యి వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
    how to make palak paneer
  • ఉడుకుతున్న పన్నీర్ ముక్కలల్లో రెండు టీ స్పూన్ల కారం పొడి ,రెండు టీ స్పూన్ల ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పువేసి నీరు అంతా ఆవిరయ్యి కొద్దిగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
  • ఇది ఇలా ఉడుకుతుండగా పన్నీర్ పోపుకోసం స్టౌ పై మరో వైపు ప్యాన్ పెట్టి అందులో ఇంతకు ముందు వాడగా మిగిలిన నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కసూరి మేతి వేసి బాగా వేగాక పాలక్ పన్నీర్ లో కలుపుకోవాలి.
  • అంతే ఎంతో రుచిగా ఉండే పాలక్ పన్నీర్ రెడీ... ఇది నేను చెప్పిన విధానం లో సరిగ్గా కొలతలు పాటిస్తూ చేస్తే కనక మీరు నమ్మరు నిజంగా అంటే నిజంగా అదరహో అని అంటారు. ఇది అచ్చం బయట హోటల్ లో చేసినట్టే ఉంటుంది.
    how to make palak paneer recipe

Video

Notes

ఇదండీ... చూశారు కదా ఎంతో రుచిగా ఉండే పాలక్ పన్నీర్ మరిన్ని మంచి రుచులకోసం మా చెఫ్ సరు వెబ్ సైట్ ని వీక్షిస్తుండండి. మీ సలహాలను, సూచనలను కామెంట్ రూపం లో తెలియజేయండి.
Keyword chef saru, curry for roti, palak paneer, palak paneer recipe, palak paneer recipe without cream, payasam recipe chef saru