Go Back
Sabudana Khichdi Recipe

సగ్గు బియ్యం కిచిడీ

సబుదాన, దీనినే సగ్గు బియ్యం అని కూడా అంటారు . సగ్గు బియ్యం కిచిడీ భారతీయ సంప్రదాయ వంటకాల్లో ఒకటి. నార్త్ ఇండియా ప్రాంతం లో శివరాత్రి ,నవ నవరాత్రులు అయిన హిందూ పర్వదినాల్లో ఉపవాస సమయం లో ఎక్కువగ తీసుకుంటారు. అనేక చోట్లల్లో ఉదయం అల్పాహారంగా చేసుకుంటారు . తక్కువ సమయం లో చేసుకునే రుచికరమైన వంటకం ఇది. దేవాలయాలలో ఈ పదార్థాన్ని నైవేద్యం గాకూడా నివేదిస్తారు . మరి మీరు ఈ సగ్గు బియ్యం కిచిడీ రుచిని ఆస్వాదించండి .
Prep Time 1 hour
Cook Time 15 minutes
Total Time 1 hour 15 minutes
Course Breakfast, Snack
Cuisine Andhra, Andhra Pradesh, Hyderabad, Indian, Telangana
Servings 4

Ingredients
  

  • సగ్గు బియ్యం ఒక కప్పు
  • పల్లీలు అరకప్పు
  • 1 Nos ఉల్లిపాయ పెద్దది
  • 1 Nos బంగాళా దుంప
  • 4 Nos పచ్చిమిర్చి
  • పసుపు తగినంత
  • ఉప్పు రుచికిసరిపడా
  • 2 tbps నూనె
  • కొత్తిమీర ఒక గుప్పెడు
  • కరివేపాకు 2 రెమ్మలు

Instructions
 

  • ముందుగా సగ్గు బియ్యాన్ని తీసుకొని మంచి నీటితో శుభ్రంగా కడుక్కొని నీటినంతటిని డ్రై చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని మూత పెట్టి గంట పాటు నాన పెట్టుకోవాలి .
  • స్టౌ పై ప్యాన్ పెట్టి వేడయ్యాక పల్లీలు వేసి సన్నని మంట పై దోరగా మాడకుండా పల్లిలలోని పచ్చి వాసన పొయ్యేవరకు వేయించుకొని చల్లారాక పొట్టుతీసి పక్కన పెట్టుకోవాలి .
  • ఇప్పడు మిక్సీ జార్ లో ఇందాక వేయించిన పల్లీలు ,ఎండు మిర్చి ,కాస్తంత ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి .
  • స్టౌ పైన ప్యాన్ పెట్టి నూనె వేసుకొని అది వేడెక్కక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ,పచ్చి మిర్చి ముక్కలు ,కరివేపాకు వేసి 5 నిమిషాల పాటు వేగనివ్వాలి .
  • వేగిన ఉల్లిపాయ ముక్కల్లో సన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళా దుంప ముక్కలు వేసి ,పసుపు ,ఉప్పు వేసి కలిపి మూతపెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి .
  • ఇప్పుడు ముందుగా నానపెట్టిన సగ్గుబియ్యాన్ని తీసుకొని ఉల్లిపాయ బంగాళా దుంప మిశ్రమం లో వేసుకొని అందులోనే మిక్సీ పట్టిపెట్టుకున్న పల్లిల పొడి మిశ్రమాన్ని వేసి కలిపి మరి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి .
    Sabudana Khichdi Recipe
  • చివరగా కొత్తిమీర చల్లుకుంటే సరి ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం కిచిడీ రఢీ .
    Sabudana Khichdi Recipe

Notes

సగ్గు బియ్యం కిచిడీ ఆస్వాదించారు కదా.. మరిన్ని రుచుల కోసం మా చెఫ్ సరు వెబ్ సైట్ నీ వీక్షించండి . మీ అమూల్యమైన సూచనలను ,సలహాలను కామెట్ రూపం లో తెలియ జేయండి... మంచి రుచులు మీ కందివ్వడమే మా లక్ష్యం .
Keyword sabudana khichdi recipe, sabudana khichdi recipe ingredients, saggubiyyam khichdi, saggubiyyam khichdi recipe