Go Back

పాయసాన్నం / బెల్లం అన్నం తయారీ విధానం — ప్రసాదం

పాయసాన్నం అదే మనలో కొన్ని ప్రాంతాల్లో బెల్లం అన్నం అంటారు కదా దీనినే తమిళులు స్వీట్ పొంగల్ అని అంటారు... మన సంప్రదాయ వంటలలో పాయసాన్నం ఒకటి. దేవుడికి పెట్టె నైవేద్యాలలో పాయసాన్నం మొదటి వరుసలో ఉంటుంది. అమ్మవారికి ఎంతో ప్రీతి ఈ పదార్థం, అందుకే అమ్మవారిని పాయసన్న ప్రియ అని అన్నారు. దీనిని ఇష్ట పడని వారు ఉండరు అంటే ఆశ్చర్యం లేదు. ఎంతో మధురమైన పదార్థం ఇది. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్దతిలో దీనిని చేస్తుంటారు. కానీ సరయైన పద్దతిలో గనక పాయసాన్నం చేస్తే మెతుకు కూడా మిగలదు. అంతా బాగుంటుంది మరి. ఇంకెందుకు ఆలస్యం చేద్దామా..?
5 from 1 vote
Prep Time 1 hour
Cook Time 30 minutes
Total Time 1 hour 30 minutes
Course Dessert
Cuisine Andhra, Andhra Pradesh, Hyderabad, Indian, South India, Telangana
Servings 5

Ingredients
  

  • 1 cup బియ్యం
  • 1 cup బెల్లం
  • 1 ltr పాలు
  • 1/4 cup ఎండుకొబ్బరి ముక్కలు
  • 1/2 cup ఆవు నెయ్యి
  • 1/2 cup పెసరపప్పు
  • 10 gsm జీడిపప్పు
  • 10 gsm కిస్మిస్
  • 1/2 tbps యాలకుల పొడి
  • పచ్చ కర్పూరం చిన్న ముక్క

Instructions
 

  • స్టౌ పై ప్యాన్ పెట్టి 2 టీ స్పూన్ ల నెయ్యి వేసి వేడయ్యాక అందులో కప్పు బియ్యం వేసి దోరగా వేయించుకోవాలి. కాస్త వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో మరికొంత నెయ్యి వేసి అది వేడయ్యాక అరకప్పు పెసరపప్పు గింజ ఏమాత్రం మాడకుండా దోరగా వేయించుకోనిపక్కనపెట్టుకోవాలి. బియ్యాన్ని, పప్పును కలిపి కూడా వేయించుకోవచ్చు. నేనుమాత్రం దేనికది విడివిడిగా వెయిస్తే బాగా వేగుతాయి అని అలా వేయించుకుంటాను.
  • వేయించిన పెసర పప్పును కాకుండా కేవలం వేయించిన బియ్యాన్ని మాత్రమే కడగకుండా నీళ్ళు పోసి ఒక గంట సేపు నానపెట్టుకోవాలి.
  • ఇప్పుడు వేయించిన పేసరపప్పును గిన్నెలో వేసి పాలు పోసి పొయ్యి మీదపెట్టి పాలు ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచాలి. అప్పడికె ముందుగా వేసిన పెసరపప్పు కాస్త ఉడికుంటుంది. ఇప్పుడు అందులోనే గంటసేపు నానపెట్టుకున్న బియ్యాన్ని వేసి కలిపి ఉడకనివ్వాలి.
  • బియ్యం ఉడికేంత లోపు స్టౌ పైన మరో వైపు గిన్నె పెట్టి బెల్లం వేసి కాసిన్ని నీళ్ళు పోసి కొద్దిగా ముదురు పాకం వచ్చేంత వరకు ఉంచి దించుకోవాలి. ఈ బెల్లం పాకాన్ని టీ వడకట్టే జెల్లడ తీసుకొని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లాన్ని అలానే చిన్నచిన్న ముక్కలుగా చేసుకొని కూడా ఉడుకుతున్న అన్నం లో వేసుకోవచ్చు ఇలా ఎందుకు చేసుకోవడం అంటే బెల్లం లో చెత్తగాని, చిన్నచిన్న రాళ్ళు కాని ఉన్న వడకట్టు కోవడం వల్ల వెళ్లిపోతాయి దానివల్ల తినెప్పుడు ఇబ్బంది ఉండదు.
  • పాలల్లో ఉడుకుతున్న బియ్యాన్ని గరిట తో తీసుకొని చిదిమితే అన్నంమెతుకు చీడిమి పోవాలి. అప్పుడే బెల్లం పాకం పోసుకోవడం గాని బెల్లాన్ని వేయడం గాని చేయాలి. లేదంటే అన్నం పూర్తిగా ఉడకదు అని గుర్తుపెట్టుకోవాలి.
  • ఇలా అన్నం బాగా మెత్తగా ఉడికాక అందులో మనం పాకం పట్టిన బెల్లం పాకం, యాలకుల పొడి వేసి 5 నిమిషాలు కలపకుండా అలానే వదిలేయ్యాలి. వెంటనే కలిపితే పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది.
  • బాగా ఉడుకుతున్న సమయం లో పోసిన పాకం అన్నంలో కలిసేలా బాగా కలిపి ఇప్పుడు అందులోనే 2 టీ స్పూన్ ల నెయ్యి వేసి కలపాలి. పాలు దగ్గర పడుతున్న సమయం లో మరో ప్యాన్ లో నెయ్యి వేసి అందు, ఎండుకొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేసి లేత బంగారు రంగు లోకి వచ్చేంత వరకు వేయించి ఉడుకుతున్న అన్నం లో వేసి కలపాలి.
  • 5 నిమిషాలు అలాగే వదిలేసి చివరగా చాలా కొద్దిగా పచ్చకర్పూరం చిదిమి పొడిలా అన్నం అంతా చల్లుకోని దించుకోవాలి.
  • అంతేనండి పాయసాన్నం సిద్దమైనట్టే... ఇది ప్రసాదం గాని పండగల పూట గాని చేసుకుంటే పండగ వతావరణమంత ఇది తింటుంటేనే తెలుస్తుంది. కానీ ఇక్కడ అమ్మవారికి నైవేద్యం గా చేయాలనుకుంటే మాత్రం ఆవు పాలే వాడండి. ఇంకా మంచిది.
    payasannam / bellam annam recipe chef saru

Video

Notes

ఇదండీ అమ్మవారికి ఎంతో ఇస్టమైన పాయ సాన్నం చూశారు కదా తిని రుచి ఎలావుందో తెలియజేయండి. మరిన్ని మంచి రుచులకోసం మా చెఫ్ సరు వెబ్ సైట్ ని వీక్షిస్తుండండి. మీ అమూల్యమిన సూచనలను ,సలహాలను మీ కామెంట్ రూపం లో తెలియజేయండి.
Keyword bellam annam, bellam rice, payasannam, prasadam recipe, prasadam recipes, sweet rice