Go Back
Mokkajonna garelu / Corn vada recipe Chef saru

క్రిస్పీ గా ఉండే టేస్టీ మొక్కజొన్న గారెలు / వడలు | Mokkajonna garelu | Corn vada recipe

Prep Time 20 minutes
Cook Time 30 minutes
Total Time 50 minutes
Course Main Course
Cuisine Andhra, Indian, south indian, Telangana
Servings 6

Ingredients
  

  • 1 కప్పు మొక్క జొన్న గింజలు
  • 5 పచ్చి మిర్చి
  • ½ కప్పు కొత్తిమీర
  • అల్లం ముక్క చిన్నది
  • 3 కరివేపాకు రెబ్బలు
  • ½ కప్పు శనగ పప్పు
  • 1 టీ స్పూన్ పసుపు
  • 2 tbsp బియ్యం పిండి
  • 1 tbsp కారం
  • ఉప్పు రుచికి సరిపడా
  • ½ కప్పు ఉల్లిపాయ తరుగు
  • నూనె సరిపడా

Instructions
 

  • ముందుగా అరకప్పు శనగ పప్పు ను తీసుకొని బాగా కడిగి కనీసం గంట పాటు నాన పెట్టుకోవాలి.
    Mokkajonna garelu / Corn vada recipe Chef saru
  • ఇప్పుడు మొక్క జొన్న కంకులను తీసుకొని గింజలన్నీ ఒలుచుకొని శుభ్రం చేసి మిక్సీ జార్లో మొక్క జొన్న గింజలు పచ్చి మిర్చి, చిన్న అల్లం ముక్క వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకొని, ఒక గిన్నె లో వేసి, ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
    Mokkajonna garelu / Corn vada recipe Chef saru
  • ముందుగా నానపెట్టుకున్న శనగ పప్పును తీసుకొని నీటిని అంతా తీసేసి మిక్సీ పట్టుకున్న మొక్క జొన్న మిశ్రమం లో వేసి ఇందులోనే, ఉల్లిపాయ తరుగు, కొద్దిగా బియ్యం పిండి, కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా అన్నీ కలిసేలా కలుపుకొని అన్నింటికీ ఉప్పు పట్టేలా ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
    ఇందులో ఉల్లిపాయ తరుగు, బియ్యం పిండి నచ్చని వారు వేసుకోక పోయిన పర్వలేదు. బియ్యం పిండి వేయడం వలన గారెలు చక్కగా పొంగుతాయి.
    Mokkajonna garelu / Corn vada recipe Chef saru
  • ఇలా 5 నిమిషాలు నానిన ఈ మిశ్రమాన్ని ఒక సారి కలిపి, స్టౌ వెలిగించి ముకుడు పెట్టి డీప్ ఫ్రై కి సరి పడా నూనె పోసి బాగా వేడయ్యాక కొద్దికొద్దిగా పిండి తీసుకొని గారేలులాగా చేతి పైన ఒత్తుకొని, నూనెలో వేసి లేత బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి.
    గారెలు చేతిపైన రాని వారు అరటాకు పై గాని కవర్ గాని చేసుకోవచ్చు.
    వేయించేటప్పుడు మాత్రం సన్నని మంట పైనే వేయించాలి. పెద్ద మంట పెడితే వేగుతాయి కానీ లోపల అలానే పచ్చిగా ఉంటాయి. లోపలి దాక వేగాలి అంటే సన్నని మంట పైననే చేసుకోవాలని గుర్తుంచుకోండి.
    Mokkajonna garelu / Corn vada recipe Chef saru
  • ఇలా ఒకదాని తరువాత ఒకటి వేసుకుంటే సరి ఎంతో రుచిగా ఉండే మొక్క జొన్న గారెలు రెడీ.
    Mokkajonna garelu / Corn vada recipe Chef saru

Notes

ఇలాంటి మరిన్ని మంచి రుచులకు మా చెఫ్ సరు వెబ్ సైట్ ని వీక్షిస్తూండండి. మీ సూచనలు, సలహాలు మాకు కామెంట్ రూపం లో తెలియజేయండి.
Keyword corn recipe, corn vada recipe, garelu, makka garelu, mokkajonna garelu, mokkajonna vadalu, veg recipe