కడాయిలో పచ్చిమిర్చి వేసి సగం వరకు వేగాక ధనియాలు జీలకర్ర వెల్లుల్లి కొత్తిమీర వేసి ఇవన్నీ చివరగా నువ్వులు వేసి దోరగా వేయించుకుని ఇవన్నీ మరొక బౌల్ లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో నూనె వేసి అందులో టమాటా ముక్కలు వేసి బాగా మగ్గనివ్వండి.
తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న వాటిని మిక్సీ జార్ లో వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అత్తమ్మ అయితే ఒకటిన్నర స్పూన్ల ఉప్పు వేసింది మీరైతే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి.
పచ్చిమిర్చి ఆ మిగిలిన వేయించుకున్న పదార్థాలన్నీ మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మనం మగ్గించుకున్న టమాటాలు తీసుకొని దాంట్లో వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి అప్పుడే మీకు రోల్ లో నూరుకున్న ఫీలింగ్ ఉంటుంది.
ఇవన్నీ నూరుకున్నారు సరే మరి తాలింపు పెట్టుకోవాలి కదా... అందుకే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఆ పాన్ బాగా వేడి అయ్యాక రెండు స్పూన్ల నూనె వేసుకొని నూనె కొద్దిగా వేడి అయ్యాక. రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. అర టీ స్పూను శనగపప్పు వేసి కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు రెబ్బల కరివేపాకు చిటికెడంత పసుపు కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేగాక రుబ్బుకున్న పచ్చడిలో వేసుకోండి.