Go Back
meal maker masala

మీల్ మేకర్ మసాల | Soya Chunks Curry (Meal Maker Masala Curry)

మీల్ మేకర్( meal maker curry in telugu ) ఎంతో అద్బుతంగా ఉండే పదార్థం... అద్బుతంగా ఉండడమే కాదు. అందరికీ నచ్చే పదార్థం కూడా. ఈ మీల్ మేకర్ శాకహారులకు ఎంతో ప్రియమైన వంటకం. ఏది ఎంతో రుచిగా ఉండి. ఎందరినో తనచుట్టూ తిప్పుకుంటుంది . ఈ కూర చపాతిల్లోకి రొటీలోకి కూడా చాలా బాగుంటుంది. మరి అలాంటి నోరూరించే మీల్ మేకర్ మసాలను చేసేద్దాం పదండి... మరి...
Prep Time 20 minutes
Cook Time 30 minutes
Total Time 50 minutes
Course Curry, dinner, lunch, Veg Curry
Cuisine Andhra, Andhra Pradesh, Hyderabad, Indian, Telangana
Servings 6

Ingredients
  

  • 1 cup మీల్ మేకర్స్
  • 1 tbps కారం
  • 1 tbps ధనియాల పొడి
  • 1 tbps మిరియాలు
  • 4 బిర్యానీ ఆకులు
  • 1 tbps లవంగాలు
  • 1 మారాటి మొగ్గ
  • 4 ఇలాచి
  • 1 tbps పసుపు
  • 4 ఉల్లిపాయలు పెద్దవి
  • 3 టమాటలు పెద్దవి
  • 4 కరివేపాకు రెమ్మలు
  • 1 కొత్తిమీర కట్ట
  • 1 tbps కసూరి మేతి
  • 4 పచ్చిమిర్చి
  • 4 ఎండు మిర్చి
  • 1 tbps గడ్డ పెరుగు

Instructions
 

  • ముందుగా కప్పు మీల్ మేకర్స్ ను తీసుకొని వేడి నీటిలో వేసి 5 నిమిషాలు నాన పెట్టుకొని మిల్ మేకర్స్ బాగా నానిన తరువాత నీరంత బాగా పిండి మిల్ మేకర్స్ ని పక్కన పెట్టుకోవాలి. మిల్ మేకర్స్ ని నానపెట్టుకోవడానికి వేడి నీరే అవసరం లేదు. చల్లటి నీళ్ళల్లో అయిన నాన పెట్టుకోవచ్చు. కానీ వేడి నీరైతే మీల్ మేకర్స్ బాగా నానడమే కాకుండా కొద్దిగా ఊదుకుతాయి కూడా దీనివల్ల మీల్ మేకర్స్ కి ఇంకా మంచి రుచి వస్తుంది.
  • ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు తీసుకొని గడ్డలు గడ్డలు లేకుండా బాగా గిలకొట్టుకోవాలి. పెరుగు ను మొత్తం క్రీమ్ లాగా అయ్యేంత వరకు గిలకొట్టుకొని అందులో కారం, పసుపు, దనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకొని కలుపుకున్న ఈ మిశ్రమం లో ముందుగా నానపెట్టి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్స్ ని వేసి బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.
  • స్టౌ వెలిగించి తగినంత నూనె పోసుకొని అందులో లవంగాలు, ఇలచిలు, మారాటి మొగ్గ, అనాస పువ్వు, మీరియాలు వేసి బాగా వేగనివ్వాలి. ఇవి వేగాక అందులోనే ఉల్లిపాయలను సన్నగా తరిగి లేత బంగారు రంగు లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • వేగిన ఉల్లిపాయల్లో ఎండుమిర్చి వేసి కొద్దిగా వేగాక ఈ మిశ్రమాన్నంత మిక్సీ లో వేసి మెత్తటి పేస్ట్ లా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
  • మరళా స్టౌ వెలిగించి ప్యాన్ పెట్టి కాస్తంత నూనె పోసి అందులో బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి 2 నిమిషాల పాటు కొద్దిగా వేగనివ్వాలి. ఇవి వేగాక ఇంతకుముందు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసి బాగా కలిపి మిశ్రమం లోని పచ్చి వాసన పొయ్యేవరకు వేయించాలి. కొద్దిగా నూనె పైకి తెలుతున్న సమయం లో ముందుగా పెరుగు మిశ్రమం లో కలిపి పెట్టుకున్న మీల్ మేకర్స్ ను వేసి బాగా కలిపి టమాటా ముక్కలు వేసి నీళ్ళు పోసి మూతపెట్టి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
  • బాగా ఉడికిన తరువాత మూత తీసి బాగా కలుపుకొని కసూరి మేతి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మరో 10 నిమిషాలపాటు నీరంత ఇంకి పొయ్యి నూనె పైకి తేలెంత వరకు ఉంచి చివరిగా కొత్తిమీర చల్లుకుంటే సరి.
  • ఎంతో రుచికరమైన మీల్ మేకర్ మసాలా రెడీ అయినట్టే ఇది శాకాహార ప్రియులకు నోరూరించే వంటకం.
    meal maker masala

Video

Notes

చూశారు కదా... మీల్ మేకర్ మసాల నచ్చిందా... మరిన్ని మంచి రుచులకోసం మా చెఫ్ సరు వెబ్ సైట్ ని వీక్షిస్తుండండి. మీ సలహాలు,సూచనలను కామెంట్ రూపం లో మాకు తెలియజేయండి.
Keyword meal maker curry, meal maker curry recipe, meal maker gravy, meal maker gravy for chapathi, meal maker masala, meal maker masala curry in telugu, meal maker masala recipe