Go Back

పెరుగు అన్నం

పెరుగన్నం దీనినే దద్దోజనం అనికూడా అంటారు. ఈ పదార్థాన్ని ఏదో ఒక సందర్బం లో తినే ఉంటారు. ఎక్కువగా గుళ్ళలో ప్రసాదం గా ఈ పెరుగన్నాన్ని పెడుతుంటారు. అందుకే లలిత సహస్ర నామాల్లో అమ్మవారిని దద్యాన్న సక్త హృదయ అని అన్నారు. పెరుగన్నం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి అని దీని అర్థం. ఎంతో మంది దీనిని లంచ్ లో మరియు డిన్నర్ గా కూడా తింటుంటారు. మండే ఎండలకు మంచి చలువ ఈ పెరుగన్నం. చిన్న పిల్లకు చలువ కోసం అని తల్లులు ఎక్కువగా పెట్టె ఆహారం కూడా పేరుగన్నమే. మన అమ్మమ్మనో నాన్నమ్మ నో కడుపులో ఏదోళ ఉంది అనగానే మొదట చెప్పే మాట కాస్త పెరుగన్నం తిను అంటారు. పెరుగన్నం ఆహారం గానే కాకుండా ఔషదం గా కూడా పని చేస్తుంది. మరి ఈ పెరుగన్నాన్ని సంప్రదాయ పద్దతిలో ఎలా చేస్తారో చూసేద్దాం పదండి.
Prep Time 15 minutes
Cook Time 20 minutes
Total Time 35 minutes
Course Breakfast
Cuisine Andhra, Andhra Pradesh, Hyderabad, Indian, South India
Servings 6

Ingredients
  

  • 1 cup బియ్యం
  • 2 cups పెరుగు
  • 1/2 cup కాచి చల్లార్చిన పాలు
  • 5 nos పచ్చిమిర్చి
  • కరివేపాకు 4 రెమ్మలు
  • అల్లం చిన్న ముక్క
  • 1 tbps ఆవాలు
  • 1 tbps జీలకర్ర
  • 2 tbps పచ్చి శెనగ పప్పు
  • 2 tbps మినపపప్పు
  • కొత్తిమీర చిన్న కట్ట
  • nos నిమ్మకాయ
  • 1/2 tbps ఇంగువ
  • 5 tbps నెయ్యి
  • 4 nos ఎండు మిర్చి

Instructions
 

  • ముందుగా కప్పు బియ్యాన్ని తీసుకొని బాగా కడిగి సహజంగా అన్నం వండుకోవడానికి పోసుకునే నీటి కంటే కొద్దిగా ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే మనం పెరుగన్నం చేస్తున్నాం కదా అన్నం ఎంత మెత్తగా ఉంటే అంతా బాగా వస్తుంది పెరుగన్నం ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి పెరుగన్నానికి మనం రోజు ఉపయోగించుకునే సన్న బియ్యం కన్నా దొడ్డు బియ్యం అదేనండీ మనం రేషన్ బియ్యం అంటాం కదా అవి అయితే పెరుగన్నం చాలా అద్బుతం గా వస్తుంది.
    Curd Rice Recipe
  • ఇప్పుడు కడుక్కున్న బియ్యాన్ని చక్కగా మెత్తగా అన్నంలా వండుకోవాలి. మళ్ళీ చెపుతున్నాను అన్నం పుల్లలుగా వుంటే పెరుగన్నం అంతా బాగా రాదు గుర్తుపెట్టుకోండి.
    Daddojanam Recipe
  • వండిన అనాన్ని స్టౌ నుండి దింపుకొని వేడి చల్లారక ముందే ఒక గరిట తీసుకొని అన్నానంత ఒకసారి బియ్యం గింజ విరిగెట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపిన అన్నంలో కొద్దిగా ఉప్పు, చిటికెడు ఇంగువ వేసి కలిపి 2 నిమిషాలు వదిలేయాలి.
  • రెండు నిమిషాలు ఆగాక అన్నంలో పెరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోనే కాచి చల్లార్చిన పాలు కూడా పోసి కలిపి మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ కొందరు పెరుగన్నం లో పాలు వాడరు. కానీ పెరుగన్నంలో పెరుగుతో పాటు పాలు పోస్తే వచ్చే ఆ రుచి వేరు... పాలు కచ్చితంగా పొయ్యాలనేమి లేదు నచ్చని వాళ్ళు పోసుకోకున్న పరవాలేధు... పాలు పోస్తే మంచి రుచి వస్తుంది. ఇందులోనే ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి.పెరుగన్నం కాస్త పుల్లగా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే నిమ్మకాయ రసాన్ని పిండుకోండి. లేకపోతే వద్దు.
    Curd Rice
  • ఆ తరువాత తాలింపు కోసం స్టౌ పైన ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసి అది వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చి శనగ పప్పు, మినపపప్పు కొద్దిగా వేసి వేగనివ్వాలి. అందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఎండుమిర్చి వేసి సన్నని మంట పై పోపుదినుసులు మాడకుండా వేయించాలి.
  • ఇప్పుడు పోపు కొద్దిగా వేగాక అందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాలు వేసి కాస్త చిటపట లాడించి అందులోనే కాస్తంత ఇంగువ వేయాలి. ఇంగువ వేయడం తో ప్రాణం వచ్చినట్టవుతుంది ఎందుకంటే ఇంగువ ఆ వంటకే కొత్త రుచిని తీసుకొస్తుంది.
  • ఇంగువ కాస్త వేగాక పోపు పెట్టుకున్న ఈ మిశ్రమన్నంతటిని తీసుకెళ్ళి సరాసరి మనం పెరుగు వేసి కలిపిన అన్నం లో వేసుకొని బాగా కలుపుకొని చివరిగా కొత్తిమీర తురుము చల్లితే సరి అమృతం లాంటి పెరుగన్నం రెడీ.
  • ఈ పెరుగన్నం తయారీలో చాలా వరకు దానిమ్మ గింజలు, ద్రాక్షాపళ్లు ,సన్నగా తరిగిన యాపిల్ ముక్కలు వంటివి కూడా వేస్తుంటారు. నేను మాత్రం అవి వాడను మీకు కావాలంటే వేసుకోవచ్చు.
  • అంతే ఎంతో కమ్మటి పెరుగన్నం రెడీ. దీన్నే దద్దోజనం అని కూడా అంటారు . ఏమి తినబుద్ది అవ్వనపుడు, కడుపులో నలత గా ఉన్నప్పుడు , ప్రసాదానికి ఇలా అన్నీ రకాలుగా ఈ పెరుగన్నం వాడుకోవవచ్చు. ఎంతో కమ్మటి రుచి గల ఈ పెరుగన్నం మంచి ప్రొ బయోటిక్ కూడా...
    Curd Rice Recipe

Notes

ఇదండీ మా స్టైల్ లో పెరుగన్నం... నచ్చిందా వెంటనే మీరు చేసుకోండి మరి... మరిన్ని మంచి రుచుల కోసం మా చెఫ్ సరు వెబ్ సైట్ ను వీక్షించండి... మీ అమూల్య మైన సలహాలను, సూచలను కామెంట్ రూపం లో మాకు తెలియజేయండి.
Keyword beakefast recipes, daddojanam, healthy recipes, perugu annam, prasadam recipes