Go Back

బీట్ రూట్ దోశ

బీట్ రూట్ జ్యూస్ తాగడం బోర్ కొడితే.. మరో రూపంలో దీన్ని తీసుకోండి. దోశ రూపంలో అల్పాహారంగా తినేసేయండి. బీట్‌రూట్‌కి నో చెప్పిన వారు కూడా టేస్టీ టేస్టీగా ఉండే బీట్ రూట్ దోశ తినేస్తారు.
Course Breakfast
Cuisine Andhra, Andhra Pradesh, Hyderabad, Indian
Servings 4

Ingredients
  

  • 2 cups బీట్ రూట్ ముక్కలు
  • 1 cups బియ్యప్పిండి
  • 2 tbps మైదా పిండి
  • 1/2 cup ఉల్లిపాయ సన్నగా తరిగినది
  • 2 nos పచ్చి మిర్చి సన్నగా తరిగినవి
  • 2 tbps కొత్తిమీర
  • 1/4 tbps జీలకర్ర
  • ఉప్పు రుచికి తగినంత

Instructions
 

  • ముందుగా బీట్ రూట్ ముక్కల్లో, జీలకర్ర తగినన్ని నీళ్ళు పోసిస్టవ్ ని సిమ్ లో పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం ద్వారా బీట్ రూట్ లో ఉంటే వగరు తగ్గుతుంది అలాగే దోస పిండి లాగా కలుపు కోవడానికి ఉపయోగం గా ఉంటుంది.
    Beetroot Dosa Recipe / Healthy breakfast recipes / Chef saru
  • ఉడికిన బీట్రూట్ ముక్కలను నీళ్ళలోనించి పక్కకు తీసి గోరు వెచ్చగా అయ్యేంత వరకు ఆగండి.
    Beetroot Dosa Recipe / Healthy breakfast recipes / Chef saru
  • చల్లారిన బీట్రూట్ ముక్కలని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  •  రుబ్బిన మిశ్రమంలో కప్పు బియ్యప్పిండి రెండు స్పూన్ల మైదా పిండి రుచికి తగినంత ఉప్పు వేసి మనం బీట్ రూట్ ముక్కలను ఉడికించాక పక్కకు పెట్టాం కదా ఆ నీళ్ళు వేసుకుంటూ దోస పిండి లాగా కలపండి.
  • ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి బీట్ రూట్ పిండిని గరిటెతో తీసుకొని పెనం మీద వేసి దోశలాగా వేసి కాసింత నూనె పైన రాసి కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర పైన చల్లుకుని సన్నని మంట మీద దోసె కాల్చుకోవాలి.
    Beetroot Dosa Recipe / Healthy breakfast recipes / Chef saru
  • ఉల్లిపాయలు అలా పైన కనపడితే నచ్చని వాళ్ళు దోసె వేసుకునే ముందు మనం కలువుకున్న పిండి లోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుని దోసె వేసుకోవచ్చు.
  • ఓ వైపు కాలిన తర్వాత... మరోవైపు తిప్పుకోవాలి. అంతే బీట్ రూట్ దోశ రెడీ అయిపోయింది. ఏదైనా చట్నీలో కలుపుకొని తినండి. టేస్టీగా ఉంటంది. అంతేకాదు... ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
    Beetroot Dosa Recipe / Healthy breakfast recipes / Chef saru

Notes

బీట్‌రూట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. మీ రోగనిరోధక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది.
Keyword beakefast recipes, Beetroot dosa, chef saru, Dosa, dosa recipes, telugu vantalu