పెసర్లు వీటినే ఆంగ్లంలో "ముంగ్ బీన్స్'' అని అంటారు. వీటిలో మెగ్నిషియం,కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి. కాని పిల్లలు వీటిని తినడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. అలాంటప్పుడు ఇలా కొత్తగా ప్రయత్నిస్తే సరి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినడమె కాకుండ దానిలో ఉన్న విటమిన్స్ పిల్లల ఎదుగుదలకు ఎంత గానొ ఉపరిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఎంతో రుచిగా ఉండె పెసర మొలకల పకోడిలు చేసేద్దాం.
ముందుగా ఒక కప్పు పెసర గింజ తీసుకొని శుభ్రం గా కడిగి 5 నుండి 6 గంటలు నానపెట్టుకోవాలి. బాగా నానిన పెసరలలోని నీటినంత వడ కట్టి బట్టలో కట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం వరకు చల్లగా మొలకలు వస్తాయి.
ఇలా మొలకలు వచ్చిన పెసరలను తీసుకొని మిక్సీ జార్లో వేసి అందులోనే పుదీనా తరుగు, పచ్చి మిర్చి, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
రుబ్బిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో రెండు చెంచాల బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, సన్నగా తరిగిన కరివేపాకు వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఇందులో బియ్యం పిండిని వేయడం వల్ల పకోడీలు మంచి గా కరకర లాడుతూ వస్తాయి.
ఇప్పుడు స్టౌ పై డిఫ్రై అనువుగా వుండేటువంటి కొద్దిగా లోతుగా ఉండే కడాయి పెట్టి సరిపడా నూనె పోసి నూనె వేడయ్యాక సిద్దం చేసిపెట్టుకున్న పిండిని ఉల్లిపాయ పకోడిళ్ళగా నూనెలో వేసుకొని లేత బంగారు రంగు వచ్చేంత వరకు వేయించాలి. మరి పెద్ద మంట కాకుండా సన్నని మంటపైన మాత్రమే వేయించుకోవాలి. ఇలా అయితేనే పకోడీలు లోపడి వరకు కాలి కరకరలాడుతుంటాయి.
అంతే నండి ఎంతో రుచిగా ఉండే పెసర మొలకల పకోడీలు రెడీ. మామూలుగా పెసరపప్పు తో చేసే వాటికి ఇలా మొలకెత్తిన వాటితో చేసే వాటికి రుచిలో పొంతననే ఉండదు. వాటికంటే ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి.
Notes
ఇదండీ .. చూశారు కదా .. మరిన్ని మంచి రుచులకు మా చెఫ్ సరు వెబ్ సైట్ ని వీక్షిస్తుడండి . మీ సలహాలు ,సూచనలు కామెంట్ రూపం లో తెలియజేయండి .