Go Back
chicken pachadi / chicken pickle chef saru

పక్కా కొలతలతో రుచికరమైన చికెన్ పచ్చడి రెసిపీ తయారీ విధానం

పక్కా కొలతలతో 1 కేజీ చికెన్ పచ్చడిని రుచికరంగా & సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. ఈ చికెన్ పచ్చడి 4 నెలల వరకు ఎంచక్కా నిలువ ఉంటుంది. ఏ కూర చేసుకున్నా, ఏ రసం చేసుకున్నా పక్కన ఒక్క 4 ముక్కలు పెట్టుకుని కాసింత అంటు పెట్టుకుని తింటుంటే ఉంటుంది. ఏ కారణం చేతనైనా మిస్ అవకండి!
4 from 4 votes
Prep Time 10 minutes
Cook Time 20 minutes
Resting Time 2 hours
Course non veg, pickel, pickles
Cuisine Andhra, Indian, south indian, Telangana

Ingredients
  

  • 1 kg చికెన్ ( బోన్ లెస్ చికెన్ )
  • 3 tbsp కారం
  • 3 tbsp ఉప్పు
  • 1 tbsp పసుపు
  • 4 tbsp అల్లం వెల్లుల్లి పేస్టు
  • 2 tbsp ధనియాలు
  • 1 tbsp జీలకర్ర
  • 300 ml నూనె
  • 2 inch దాల్చిన చెక్క
  • 4 లవంగాలు
  • 4 యాలకులు
  • 8 మిరియాలు
  • ½ tbsp ఆవాలు
  • ½ మెంతులు
  • 3 నిమ్మకాయల రసం

Instructions
 

  • ముందుగా 1 kg చికెన్లో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి చికెన్ ముక్కలకు పట్టించాలి. బాగా పట్టించిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి.
    chicken recipes chicken curries chef saru pachadi pickle
  • పొయ్యి మీద కడాయి పెట్టి వేడయ్యాక రెండు టీ స్పూన్ల ధనియాలు, 8 మిరియాలు, మూడు యాలకులు, నాలుగు లవంగాలు, రెండు ఇంచుల దాల్చిన చెక్క, ఒక టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ల మెంతులు, అర టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడేంతవరకు వేయించి చల్లరాక పొడి చేసి పెట్టుకోవాలి.
    populu chicken pachadi / pickle
  • కడాయిలో చికెన్ ముక్కలు వేయించేంత నూనె పోసుకొని వేడి చేసుకుని ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టిన చికెన్ మిశ్రమాన్ని కడాయి లో పట్టేంత వేసి గరిటతో కలపెట్టాలి. చికెన్ ఉడుకుతున్నప్పుడు నీరు వస్తుంది ఆ నీరంతా పోయేంత వరకు గరిటతో తిప్పుతూ తక్కువ మంట మీద చికెన్ అంతా లేత ఎరుపు వేయించుకోవాలి.
    chicken recipes chicken pachadi / chicken pickle chef saru
  • వేయించుకున్నప్పుడే బాగా ఎర్రగా అయితే తర్వాత ముక్కలు నల్లగా అవుతాయి. కాబట్టి దోరగా అంటే మరీ ఎర్రగా కాకుండా దోరగా ఉన్నప్పుడే అందులో నాలుగు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి.
    chicken pachadi / chicken pickle chef saru
  • తర్వాత పొడి చేసుకున్న మసాలాని వేసి గరిటతో తిప్పుతూ కారం ఉప్పు వేసి కలిపి వెంటనే దించేయాలి ఎందుకంటే మంట మీద ఎక్కువ సేపు ఉంచితే కారం నల్లగా అవుతుంది.
    chicken recipes chicken pachadi / chicken pickle chef saru
  • కారం వేసిన అర నిమిషంలోనే కడాయి దించుకొని ఆ మిశ్రమాన్ని బాగా కలబెట్టుకుని రెండు గంటలు పక్కకు పెట్టుకోండి.
    chicken pachadi / chicken pickle chef saru
  • పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత మూడు నిమ్మకాయల రసాన్ని పచ్చట్లో పోసి మంచిగా ఇవన్నీ కలిసేంత వరకు కలబెట్టుకోండి.
    chicken pachadi / chicken pickle chef saru
  • అంతే ఎంతో రుచికరమైన .. నాన్ వెజ్ ప్రియుల చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది . ఈ పచ్చడిని మూడు నాలుగు రోజుల తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది అప్పటికప్పుడే అంత రుచి అనిపించకపోవచ్చు.
    chicken pachadi / chicken pickle chef saru

Video

Notes

ఈ పచ్చడి తయారు చేయడమ్ అయిపోయిన తర్వాత ప్లాస్టిక్ డబ్బాల్లో గాని గాజు సీసాలో కానీ నిలువ ఉంచుకోవచ్చు అలాగే మరీ మరీ చెప్తున్నాను అస్సలు మర్చిపోకండి. ఈ పచ్చడి వాడుకునేపపుడు తడి తగలకుండా చూసుకోండి అలాగే మూతని ఎప్పటికప్పుడు టైట్ గా పెట్టుకోండి.
Keyword chef saru, chicken pachadi, chicken pickle, kodi kura pachadi, kodi kura pickle, natu kodi pachadi, natu kodi pickle, non veg pickle, pickle, spaicy pickle