Go Back
Gongura Pulusu Recipe / Gongura Koora / Gongura Rasam / Gongura Sambar / Gongura Recipe / Gongura Curry / Veg Recipe / Chef Saru

గోంగూర పులుసు | గోంగూర రసం | గోంగూర సాంబార్ రెసిపీ తయారీ విధానం

Prep Time 1 hour
Cook Time 30 minutes
Total Time 1 hour 30 minutes
Course Main Course
Cuisine Andhra, Indian, south indian, Telangana, telugu
Servings 6

Ingredients
  
  • 2 కప్పులు తరిగిన గోంగూర ఆకులు
  • 1 కప్పు పెద్దగా కోసిన ఉల్లిపాయ ముక్కలు
  • 3 టమాటలు
  • ¼ కప్పు శనగ పప్పు
  • చింత పండు పెద్ద నిమ్మ పండు సైజు
  • 1 టేబుల్ స్పూన్ శనగ పిండి
  • ½ కప్పు నూనె
  • 1 టీ స్పూన్ ఆవాలు
  • 1 టీ స్పూన్ జీలకర్ర
  • ½ టీ స్పూన్ పసుపు
  • 6 వెల్లుల్లి రెబ్బలు
  • ½ టీ స్పూన్ ఇంగువ
  • 4 రెబ్బలు కరివేపాకు
  • ¼ కప్పు కొత్తిమీర తరుగు
  • 4 ఎండు మిర్చి
  • 1 టేబుల్ స్పూన్ కారం
  • 2 టీ స్పూన్ మినప పప్పు
  • 2 టీ స్పూన్ ధనియాలు

Instructions
 
  • ముందుగా శనగ పప్పును బాగా కడిగి ఒక గంట పాటు నాన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లో ముందుగా నాన పెట్టుకున్న శనగ పప్పు, గోంగూర, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, కొద్దిగా పసుపు, సరిపడా నీళ్ళు పోసి మూతపెట్టి ఒక 3 అంటే మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
    Gongura Pulusu Recipe / Gongura Koora / Gongura Rasam / Gongura Sambar / Gongura Recipe / Gongura Curry / Veg Recipe / Chef Saru
  • స్టౌ పైన ముకుడు పెట్టి అందులో తాళింపుకు సరిపడా నూనె పోసి నూనె కాస్త వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, మినపపప్పు, ధనియాలు వేసి కాస్త చితపడ లాడించాలి.
  • ఇప్పుడు అందులోనే ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకున్న ఉల్లి పాయలు, కరివేపాకు వేసి మూతపెట్టి ఉల్లి పాయలు మగ్గే వరకు ఉడకనివ్వాలి.
    వెల్లుల్లి రెబ్బలు వేయడం వలన తాలింపు మరింత రుచి వస్తుంది . కొందరికి వెల్లుల్లి ఇష్టం ఉండదు . అలా అనుకున్న వాళ్ళు వేసుకోక పోయిన పరవాలేదు.
    Gongura Pulusu Recipe / Gongura Koora / Gongura Rasam / Gongura Sambar / Gongura Recipe / Gongura Curry / Veg Recipe / Chef Saru
  • ఉల్లి పాయలు నూనెలో బాగా మగ్గిన తరువాత కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు వేసి చిక్కగా పీసీకి పెట్టుకున్న చింత పండు రసం పోసి రసం కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు మరగనివ్వాలి.
    Gongura Pulusu Recipe / Gongura Koora / Gongura Rasam / Gongura Sambar / Gongura Recipe / Gongura Curry / Veg Recipe / Chef Saru
  • చింతపండు రసం దగ్గర పడుతున్న సమయం లో ముందు ఉడికించి పెట్టుకున్న పప్పును పప్పు గుత్తితో బాగా మెతుపుకొని మరుగుతున్న చింతపండు రసం లో పోసుకొని 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలిపి మూతపెట్టి 10 నిమిషాలు సన్నని మంటపై మరగానివ్వాలి.
    Gongura Pulusu Recipe / Gongura Koora / Gongura Rasam / Gongura Sambar / Gongura Recipe / Gongura Curry / Veg Recipe / Chef Saru
  • ఇప్పుడు 2 టీ స్పూన్ ల శనగ పిండి తీసుకొని అందులో కొన్ని నీళ్ళు పోసి కొద్దిగా జారుగా కలుపుకొని మరుగుతున్న సాంబార్ లో పోసుకొని పిండి మొత్తం కలిసేంత వరకు మరగనివ్వాలి.
    ఇక్కడ శనగ పిండి నచ్చని వారు బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు.
    Gongura Pulusu Recipe / Gongura Koora / Gongura Rasam / Gongura Sambar / Gongura Recipe / Gongura Curry / Veg Recipe / Chef Saru
  • బాగా మరిగిన దీనిలో కొద్దిగా ఇంగువ వేసి ,ముందుగా వేసిన ఉప్పు సరిపోక పోతే మరలా కొద్దిగా వేసి చివరగా కొత్తిమీర చల్లుకొని దించుకుంటే సరి ఎంతో పుల్లపుల్లగా రుచిగా ఉండే గోంగూర రసం రెడీ.
    Gongura Pulusu Recipe / Gongura Koora / Gongura Rasam / Gongura Sambar / Gongura Recipe / Gongura Curry / Veg Recipe / Chef Saru

Notes

చూడారు కదా ఎంతో రుచికరంగా ఉండే గోంగూర సాంబార్... బాగుందా మరిన్ని మంచి రుచులకోసం మా చెఫ్ సరు వెబ్ సైట్ ని వీక్షిస్తూండండి. మీ సలహాలు సూచనలను మాకు కామెంట్ రూపం లో తెలియ జేయండి.
Keyword Gongura, Gongura Curry, Gongura Pulusu, Gongura Rasam, Gongura Recipe, Gongura Sambar, Veg Curry, Veg Rasam Recipe