Go Back
Gummadikaya Paratha

గుమ్మడి కాయ పరోటాలు

పరోటాలు... ఆ రోజు హోటల్ లో తింటూనే ఉంటాం కదా అని అనుకుంటున్నారేమో మీరన్నది నిజమే కానీ ఇవి మనం తరచుగా తినే పరోటాలు కావు. ఆరోగ్యాన్ని మరియు మంచి రుచిని అందించే గుమ్మడి కాయతో చేసే గుమ్మడికాయ పరోటాలు (gummadikaya paratha in telugu)... గుమ్మడికాయ ను ఎక్కుగా సాంబార్ లో వేస్తుంటారు. కొందరు గుమ్మడికాయ తో కూర, ఫ్రై కూడా చేస్తుంటారు. మరి మనం ఇంకా కొత్తగా పరోటాలు చేసేద్దాం... పదండి...
Prep Time 30 minutes
Cook Time 15 minutes
Total Time 45 minutes
Course Breakfast, dinner, lunch, Main Course, Side Dish
Cuisine Andhra, Andhra Pradesh, Hyderabad, Indian
Servings 5

Ingredients
  

  • 1 cup గుమ్మడికాయ గుజ్జు
  • 3 cups మైదా పిండి
  • ఉప్పు రుచికి తగినంత
  • నూనె సరిపడా

Instructions
 

  • ముందుగా కూర గుమ్మడికాయ ను తీసుకొని శుభ్రం గా కడిగి పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కట్ చేసిన గుమ్మడికాయ ముక్కలను కుక్కర్ లోవేసి మెత్తగా ఉడికించుకొని ముద్దలా చేసుకోని పక్కన పెట్టుకోవాలి.
    Andhra style Gummadikaya Paratha recipe
  • ఇప్పుడు ఒక గిన్నెలో మైదాపిండితీసుకొని అందులో కొద్దిగా నూనె,తగినంత ఉప్పు, ఇందాక ఉడికించి ముద్దలా చేసుకున్న గుమ్మడికాయ గుజ్జు, కొద్దిగా వేడినీళ్లు పోసి బాగా కలిపి పక్కస పెట్టుకోవాలి. వేడి నీళ్ళు పోయడం వల్ల ఆవేడికి గుమ్మడి కాయ గుజ్జు ,పిండి ఉడికినట్టుగా అయ్యి బాగా కలుస్తాయి. దీనివల్ల పరోటాలు చాలా సాఫ్ట్ గా వస్తాయి.
    chef saru wheat flour
  • మైదా పిండి, గుమ్మడి కాయ గుజ్జు బాగా కలిసేలా 10 నిమిషాలు కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే అంతా బాగా పేవతలు వస్తాయి అని గుర్తుపెట్టుకోండి.
    chef saru-pumpkin puree
  • ఇలా కలుపుకొని ఒక 20 నిమిషాలు గిన్నెలో వేసి మూతపెట్టి అలానే వదిలేయ్యాలి.
    chef saru gummadikaya recipie timing
  • ఇరవై నిమిషాల్లో పిండి బాగా నానుతుంది. ఇలా నానిన పిండిని తీసుకొని బాగా కలిపి చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని మామూలు పరోటాలు ఎలా చేస్తామో అచ్చం అలాగే చేసుకొని స్టౌ పైన పెనం పెట్టుకొని పెనం మొత్తం నూనె అప్లయ్ చేసుకొని ఒక్కొక్కటిగా మాడిపోకుండా అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి.
    Gummadikaya Paratha
  • అంతే కొత్తగా ఎంతో రుచిగా ఉండే గుమ్మడికాయ పరోటాలు రెడీ (gummadikaya paratha ).
    Pumpkin Paratha Recipe

Notes

ఇదండీ... చూశారు కదా గుమ్మడికాయ పరోటాలు... మరిన్ని మంచి రుచులకు మా చెఫ్ సరు వెబ్ సైట్ ని వీక్షిస్తుండండి. మీ సూచనలను, సలహాలను కామెంట్ రూపం లో తెలియజేయండి.
Keyword chef saru, gummadikaya paratha, gummadikaya paratha in telugu, healthy recipes in telugu, lunch recipes, paratha, pumpkin paratha, pumpkin paratha recipe, pumpkin recipes