Go Back
coconut rice recipe

కొబ్బరి అన్నం

కొబ్బరాన్నం... ఎన్నో సార్లు గుడిలో తినే ఉంటారు. ఎక్కువగా ప్రసాదం గా చేస్తుంటారు. కొందరు దీనిని పచ్చి కొబ్బరి తురుము తో చేస్తారు. మరి కొందరు ఎండుకొబ్బరి తురుము తో చేస్తారు. కొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ కొబ్బరిని చాలా మంది తినడానికి ఇష్ట పడరు. కానీ ఎలా చేస్తే ఎంతో ఇష్టం గా తినడం కాయం. దీనిని ప్రసాదం గా కూడా చేసుకొని దేవునికి నైవేద్యం గా నివేదించవచ్చు. మీరు కూడా చేసుకొని రుచిని ఆస్వాదించండి.
Prep Time 15 minutes
Cook Time 20 minutes
Total Time 35 minutes
Course Breakfast, dinner, lunch
Cuisine Andhra, Andhra Pradesh, Hyderabad, Indian
Servings 5

Ingredients
  

  • 1 cup బియ్యం
  • 2 cup కొబ్బరి పాలు
  • 1 cup పచ్చి కొబ్బరి తురుము
  • 1 tbps మిరియాలు
  • 1/4 cup నెయ్యి
  • 4 nos పచ్చి మిర్చి :4
  • కరివేపాకు 3 రెమ్మరు
  • 2 tbps పచ్చి శనగ పప్పు
  • 2 tbps మినపపప్పు
  • 10 gms జీడిపప్పు
  • 1 tbps ఆవాలు
  • 1 tbps జీలకర్ర
  • ఇంగువ చిటికెడు
  • ఉప్పు రుచికి సరిపడా

Instructions
 

  • ముందుగా ఒక కప్పు బియ్యాన్ని కడుక్కొని కుక్కర్ లో వేసుకొని రెండు కప్పుల కొబ్బరి పాలు పోసుకొని నీళ్ళు పోయకుండా అన్నం లా వండుకోవాలి. ఒక కప్పు బియ్యనికి రెండు కప్పుల కొబ్బరి పాలు సరిగ్గా సరిపోతాయి. ఇంకా కొద్దిగా అన్నం మెత్తగా వండుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక అర కప్పు నీళ్ళను కూడా పోసుకోవచ్చు. అన్నాన్ని కొబ్బరి పాలు పోసుకోకుండా మామూలుగా నీళ్ళతో కూడా వండుకోవచ్చు. కానీ నీళ్ళతో కాకుండా కొబ్బరి పాలు పోసి అన్నం వండుకుంటే కొబ్బర అన్నం కి వచ్చే ఆ రుచే వేరు.
  • వండిన అన్నాన్ని ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో వేసి చల్లార్చుకోని పక్కన పెట్టుకోవాలి . అన్నం ముద్దగా కాకుండా కాస్త పొడి పొడి గా ఉండేట్టు చూసుకోవాలి. అప్పుడే కొబ్బర అన్నం ఇంకా బాగా వస్తుంది.
    kobbari annam
  • ఇప్పుడు పోపు కోసం స్టౌ పైన ప్యాన్ పెట్టి నెయ్యి వేసి అందులో ఆవాలు, జీలకర్ర వేసి కాస్త చిటపట లాడించి అందులోనే పచ్చి శెనగ పప్పు ,మినపపప్పు వేసి కాస్త వేగించాలి.
  • ఇవి వేగాక జీడిపప్పు, పచ్చి మిర్చి, కరివేపాకు, మిరియాలు, ఇంగువ వేసి వేయించాలి.
  • ఇవి వేగుతున్న సమయం లో ముందుగా సిద్దం చేసుకున్న పచ్చి కొబ్బరి తురుము వేసి కొబ్బరి తురుములోని పచ్చిదనం పొయ్యే వరకు వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తరవాత రుచికి సరిపడా ఉప్పు వేసి ముందుగా సిద్ద పరచుకున్న అన్నం లో వేసి బాగా కలపాలి.
  • అంతే ఎంతో రుచిగా ఉండే కొబ్బర అన్నం సిద్దం అయినట్టే ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము నచ్చని వాళ్ళు ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కచ్చితమైన కొలతలతో చేసిన కొబ్బర అన్నం ఇష్ట పడని వారు ఉండరు అంటే ఆశ్చర్యం అక్కరలేధు.
    Kobbari Annam

Notes

చూశారు కదా కొబ్బర అన్నం తయారీ విధానం మీరు చేసికొని రుచిని ఆస్వాదించండి. మరిన్ని మంచి మంచి రుచుల కొరకు మా చెఫ్ సరు వెబ్ సైట్ ని వీక్షిస్తుండండి. మీ సూచనలు ,సలహాలు మాకు కామెంట్ రూపం లో తెలియజేయండి. మీకు మంచి రుచులను అందించడమే మా లక్ష్యం.
Keyword beakefast recipes, coconut rice, kobbari annam, prasadam recipes, కొబ్బరి అన్నం, ప్రసాదం