Chef Saru Food Reciprs
www.chefsaru.com
– గోంగూర పచ్చడికి అయితే ముదిరిన ఆకు అయితే బాగుంటుంది. కానీ సాంబార్ కి లేత ఆకు అయితేనే సాంబార్ లో త్వరగా ఉడుకుటుంది . పైగా లేత ఆకు వలన సాంబార్ మంచి పుల్లటి రుచి వస్తుంది.
01
గోంగూర ఆకులు తుంచుకున్న తరువాత కనీసం గా 4 నుంచి 5 సార్లు బాగా ఇసుక లేకుండా కడగాలి.
02
అప్పుడే కోసిన లేత గోంగూర అయితే మరింత రుచిగా ఉంటుంది.
03
సాధారణంగా పులుసు ని చింతపండు రసం వేసి తాలింపు పెట్టి మరిగించి చేస్తారు. అది బాగానే ఉంటుంది కానీ అంతా చిక్కగా ఉండదు. తినేప్పుడు అన్నానికి పట్టదు అలా కాకుండా పులుసు మరింత చిక్కగా రావాలి అంటే కొద్దిగా బియ్యం పిండి కానీ శనగ పిండి కానీ నీళ్ళల్లో కలిపి పోయాలి. దీని వల్ల సాంబార్ చిక్కగా వస్తుంది.
04
శనగ పిండి గాని, బియ్యం పిండి గాని కలుపు కునేప్పుడు అలానే పొడి పిండి వేస్తే గడ్డలు కడుతుంది. పిండి మొత్తం కలవదు. అలా కాకుండా పిండి లో కాసిన్ని నీళ్ళు పోసి జారుగా కలుపుకొని సాంబార్ లో పోసుకుంటే పిండి మొత్తం కలిసిపోతుంది.
05
పులుసు అంటేనే చింతపండు రసం పోసి చేస్తాము. కానీ గోంగూరనే పుల్లగా ఉంటుంది కనుక చింతపండు అవసరం లేదు అనుకోకండి . చింత పండు వేయడం వల్ల మరింత రుచి వస్తుంది. చింత పండు పులుపు రుచి వేరు కదా మరి.
06
ఇందులో శనగ పప్పు అలానే వేయకుండా ఒక గంట పాటు నానపెట్టి వేయడం వల్ల బాగా ఉడుకుటుంది. లేదంటే అలానే పలుకు పలుకుగా ఉండి పోతుంది.
07